Bihar : క్షుద్రపూజల చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబంలో అయిదుగురి హత్య!

బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో మంత్రగత్తెలనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టి సజీవ దహనం చేసిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంచలనాత్మక సంఘటన ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెట్గామా గ్రామంలో చోటుచేసుకుంది.

New Update
bihar

బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో మంత్రగత్తెలనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టి సజీవ దహనం చేసిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంచలనాత్మక సంఘటన ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెట్గామా గ్రామంలో చోటుచేసుకుంది.  ఇటీవల జరిగిన అదే గ్రామంలో జరిగిన మరణాలకు ఆ కుటుంబమే కారణమని అనుమానిస్తూ గ్రామస్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు.  బాబూలాల్ ఒరాన్, సీతా దేవి, మంజిత్ ఒరాన్, రానియా దేవి, టపాటో మోస్మత్ లను గ్రామస్తులు మొదట తీవ్రంగా కొట్టి, ఆపై సజీవ దహనం చేశారని ఆరోపణలు ఉన్నాయి. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు.

గ్రామంలో భయానక వాతావరణం

ఈ సంఘటన తర్వాత, గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.  చాలా మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్  బృందంతో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు నకుల్ కుమార్‌ను అరెస్టు చేశారు, అతను వీరిందరిని సజీవ దహనం చేయడానికి జనసమూహాన్ని ప్రేరేపించాడని ఆరోపణలున్నాయి.  ఈ సంఘటన నుండి బయటపడి లలిత్ కుమార్ మాట్లాడుతూ తన కుటుంబం మొత్తాన్ని మంత్రగత్తెలు అనే అనుమానంతో దహనం చేశారని వాపోయాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాలను నీటిలో పడేశారని వెల్లడించాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నాలుగు కాలిపోయిన మృతదేహాలను సమీపంలోని చెరువు నుండి వెలికి తీశారు. ఈ ఘటనపై  బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు.   నేరస్థులు అప్రమత్తంగా ఉన్నారు. సీఎం అపస్మారక స్థితిలో ఉన్నారంటూ ఆయన  ట్వీట్ చేశారు.

Advertisment
తాజా కథనాలు