BIG BREAKING: పాకిస్తాన్‌లో టిక్‌టాక్‌తో పాటు ఆ యాప్స్ బ్యాన్

టిక్‌టాక్, టెలిగ్రామ్ యాప్స్‌ను పాకిస్తాన్ బ్యాన్ చేసినట్లు ఇండియా టీవీ కథనం పేర్కొంది. మతపరమైన సూత్రాలకు విరుద్ధంగా ఉండే కంటెంట్, జాతీయ భద్రత, సాంస్కృతిక విలువల దృష్ట్యా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

New Update
Pakistan Banned apps

Pakistan Banned apps

పాకిస్తాన్ టిక్‌టాక్, టెలిగ్రామ్ యాప్స్‌ను బ్యాన్ చేసినట్లు ఇండియా టీవీ కథనం పేర్కొంది. మతపరమైన సూత్రాలకు విరుద్ధంగా ఉండే కంటెంట్, జాతీయ భద్రత, సాంస్కృతిక విలువల దృష్ట్యా పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే షార్ట్ వీడియో షేరింగ్ అయిన టిక్‌టాక్ పాక్‌లో పదే పదే బ్యాన్ అవుతుంది. ఈ యాప్‌ పాక్‌లో బ్యాన్ కావడం ఇదేం మొదటిసారి కాదు.

ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి

మిత్ర దేశ యాప్‌నే..

అభ్యంతరకరమైన కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పాక్ బ్యాన్ చేసినట్లు సమాచారం. అయితే టిక్‌టాక్ చైనాది. పాక్, చైనా మిత్ర దేశాలు. భారత్-పాక్ యుద్ధ వాతావరణంలో తమ మద్దతు పాక్‌కి ఉంటుందని తెలిపింది. మరి మిత్ర దేశానికి సంబంధించిన యాప్‌ను పాక్ నిషేధించడం కాస్త ఆశ్చర్యకరమే. కానీ పాక్ ఈ యాప్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

టిక్‌టాక్‌తో పాటు ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ టెలిగ్రామ్‌ను కూడా పాక్‌లో నిషేధించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తీవ్రవాద గ్రూపులు తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నాయనే అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?

ఇదిలా ఉండగా పాక్ గతంలో వాట్సాప్‌ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను కూడా నిషేధించింది. కాకపోతే తాత్కాలికంగా కొన్ని రోజులు మాత్రమే బ్యాన్ విధించి.. ఆ తర్వాత తిరిగి మళ్లీ సేవలను తిరిగి ప్రారంభించింది. అభ్యంతర కంటెంట్ కారణంగానే పాక్ అప్పుడు కూడా సేవలను నిషేధించింది. ఇప్పుడు కూడా మళ్లీ ఈ టిక్‌టాక్, టెలిగ్రామ్ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు