BIG BREAKING: అఫ్గానిస్థాన్‌పై యుద్ధం ప్రకటించిన పాకిస్థాన్

అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య భీకరంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. అఫ్గానిస్థాన్‌పై యుద్ధం ప్రారంభించినట్లు తెలిపింది.

New Update
Pak Declares "Open War", Bombs Kabul, Kandahar After Afghanistan Attack

Pak Declares "Open War", Bombs Kabul, Kandahar After Afghanistan Attack

అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య భీకరంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. అఫ్గానిస్థాన్‌పై యుద్ధం ప్రారంభించినట్లు తెలిపింది. పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఎక్స్‌ వేదికగా ఈ పోస్టు చేశారు. మా సహనం నశించిందని.. మీకు మాకు మధ్య బహిరంగ యుద్ధమేనంటూ రాసుకొచ్చారు. 

Also Read: కూతురిని చంపి డ్రామా ఆడిన లేడీ డాక్టర్..  పోస్ట్‌మార్టంతో అసలు రంగు బయటపడింది!

ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి అఫ్గాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ గజబ్ లిల్ హక్ అనే పేరుతో ఈ దాడులు చేపట్టింది. కాబుల్‌లో మూడుసార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు తాలిబన్ అధికారులు చెప్పారు. కాబుల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్‌లలో ఈ వైమానిక దాడులు జరిగినట్లు అఫ్గాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జుబీహుల్లా వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. కానీ అఫ్గానిస్థాన్‌ మాత్రం పాక్ చేపట్టిన దాడుల్లో 55 మంది ఆ దేశ సైనికులు చనిపోయినట్లు తెలిపింది. పాకిస్థాన్ అఫ్గాన్‌ ఆరోపణలను ఖండించింది. 

Also Read: ఇరాన్‌పై అమెరికా యుద్దం ఇక్కడి నుంచే.. ఇజ్రాయెల్‌‌కు చేరుకున్న పన్నెండు F-22 ఫైటర్ జెట్లు

ఘర్షణలో ఇద్దరు పాక్ సైనికులు మాత్రమే మరణించారని.. మరో ముగ్గురు గాయపడ్డారని తెలిపింది. అంతేకాదు పాక్ సైనికల నిర్బంధంపై అఫ్గాన్ ప్రకటనను పాక్ ప్రభుత్వ ప్రతినిధి మోషరఫ్ అలీ జైదీ ఖండించారు. అఫ్గాన్ సైనికులే 133 మంది మరణించినట్లు తెలిపారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. తొమ్మిది మంది సైనికులకు నిర్బంధించామన్నారు. ఇటీవల అఫ్గాన్‌.. పాకిస్థాన్‌పై వైమానిక దాడులకు పాల్పడటంతో దీనికి ప్రతీకారంగా పాక్ విరుచుకుపడింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరాయి.  

Advertisment
తాజా కథనాలు