/rtv/media/media_files/2025/10/29/pak-afghan-2-2025-10-29-08-29-09.jpg)
టర్కీ వేదికగా అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మధ్య జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు విఫలమైనట్టు ఇరు దేశాల అధికార మీడియాలు మంగళవారం మధ్యాహ్నం ప్రకటించాయి. ఇరు దేశాలు ఒక అభిప్రాయానికి రాలేకపోవడమే కాక..నువ్వంటే నువ్వని కొట్టుకుంటున్నాయి. దీంతో త్వరలోనే పాక్, ఆఫ్ఘాన్ ల మధ్య మళ్ళీ యుద్ధం జరగవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. పాక్‌పై ఉగ్రదాడులకు తన భూభాగాన్ని ఉపయోగించబోమన్న హామీ ఇవ్వడం సహా 'తార్కిక, చట్టబద్ధమైన డిమాండ్లను' అఫ్గన్ అంగీకరించకపోవడం వల్లే ప్రతిష్టంభన ఏర్పడిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. కానీ ఆఫ్ఘాన్ మాత్రం తాము అన్ని రకాల ప్రయత్నాలను చేశామని చెబుతోంది. పాక్, అఫ్గన్ ప్రతినిధులు ఇప్పటికీ టర్కీలోనే ఉన్నప్పటికీ, నాలుగో దఫా చర్చలపై ఎటువంటి సమాచారం లేదు.
Pak-Afghan talks in Istanbul collapse as Kabul is unwilling to act against TTP which is their last bargaining chip and insurance of Endian money. Pakistan likely to resume targeting TTP hideouts in Afghanistan soon. pic.twitter.com/FxkDr7IV3R
— Baba Thoka (@Baba_Thoka) October 28, 2025
🚨 #BREAKING: #Afghanistan पाकिस्तान शांति वार्ता फेल हो चुकी है.
— Madhurendra kumar मधुरेन्द्र कुमार (@Madhurendra13) October 29, 2025
🔥 #AfghanTaliban के गृह मंत्रालय के प्रवक्ता अब्दुल मतीन क़ानी ने पाकिस्तान को चेतावनी दी है:
“हम किसी के आगे नहीं झुके। अगर पाकिस्तान ने हमला किया तो उसका जवाब ऐसा होगा जो पाकिस्तान और दूसरों के लिए सबक होगा।”… pic.twitter.com/QkqU3nUzJ0
బహిరంగ యుద్ధం తప్పదు..
శాంతి చర్చలు విఫలం అయితే ఆఫ్ఘాన్ పై యుద్ధం తప్పితే మాకు ఇంకో ఆప్షన్ లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న చర్చలు విఫలమైనా, ఒప్పందం కుదరకపోయినా బహిరంగ యుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. మాకు ఆ అవకాశం ఉందంటూ ఖవాజా చెప్పారు.ఆఫ్ఘనిస్థాన్ ఆ పరిస్థితి తెచ్చుకోదని...వారు శాంతిని కోరుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.
ఖతార్, టర్కీ సమక్షంలో కాల్పుల విరమణ..
దాదాపు పది రోజులు పాక్, ఆఫ్ఘాన్‌లు ఎడతెగని దాడులు చేసుకున్నాయి. అటు పాకిస్తాన్ సైన్యం, ఇటు తాలిబన్లు డజన్ల కొద్దీ మరణించారు. ముఖ్యంగా ఆఫ్ఘాన్ క్రికెటర్లు ముగ్గురిని పాకిస్తాన్ పొట్టన పెట్టుకుంది. దీంతో ఖతార్, టర్కీ వంటి దేశాలు జోక్యం చేసుకోవలసి వచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. తన వరకు వస్తే యుద్ధాన్ని కచ్చితంగా ఆపుతానని చెప్పారు. అయితే ఈ లోపునే ఖతార్, టర్కీల సమక్షంలో పాక్, ఆఫ్ఘన్‌లు కాల్పులు విరమణ ఒప్పదం చేసుకున్నాయి. కాబూల్ రక్షణ మంత్రి ముహమ్మద్ యాకూబ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ప్రతినిధి బృందాలు దోహాలో సమావేశంలో పాల్గొన్నాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉద్భవిస్తున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో శాంతి మరియు స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి తక్షణ చర్యలపై చర్చించారు.
Also Read: H-1b Visa: హెచ్ 1బీ వీసా ఫీజు ఎఫెక్ట్..డోర్స్ క్లోజ్ చేసిన టెక్ దిగ్గజాలు
Follow Us