/rtv/media/media_files/2025/09/26/trump-h1b-visa-2025-09-26-10-00-08.jpg)
అమెరికాలో H-1B వీసా ఫీజు లక్ష డాలర్లకు పెరగడంతో అనేక పెద్ద కంపెనీలు తమ స్పాన్సర్‌షిప్‌లను ఆపేశాయి. ప్రస్తుతం ఇక్కడ ఫ్రీజ్ నడుస్తోంది. వాల్ మార్ట్, టీసీఎస్, కాగ్నిజెంట్, అమెజాన్ తో సమా చాలా దిగ్గజ కంపెనీలు హెచ్ 1బీ హైరింగ్ ను ఆపేశాయి. దాంతో పాటూ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా చేయమని చెప్పేస్తున్నాయి. ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉన్నవాళ్లు, అమెరికన్లను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. దీంతో ప్రస్తుతం అమెరికా జాబ్ మార్కెట్ పెద్ద కుదుపుకు లోనవుతోంది.
తలకు మించిన భారంగా..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన లక్ష డాలర్ల ఫీజు కంపెనీలకు తలకు మించిన భారంగా మారుతోంది. ఈ భారీ ఖర్చులను తట్టుకోవడం కష్టమని కంపెనీలు చెబుతున్నాయి. అందుకే ఎలాంటి స్పాన్సర్ షిప్ లేని ఉద్యోగులను మాత్రమే తీసుకుంటామని కంపెనీలు అనౌన్స్ చేస్తున్నాయి. టెక్ కంపెనీల ఈ నిర్ణయం భారత ఉద్యోగులకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. దీంతో చాలా మంది ప్రతిభకు తలుపులు మూసుకుపోయినట్టే. అంతర్జాతీయంగా H-1B స్పాన్సర్స్‌లో అగ్రస్థానంలో ఉండే ఇండియన్ ఐటీ దిగ్గజం టీసీఎస్ సైతం ఈ ప్రోగ్రామ్ ద్వారా కొత్త నియామకాలను నిలిపివేయడం చాలా పెద్ద విషయమనే చెప్పాలి.
ఇతర రంగాల కంపెనీలపై కూడా..
హెచ్ 1బీ ఫీజుల ఎఫెక్ట్ కేవలం టెక్ కంపెనీల మీదనే కాదు..ఇతర రంగాల్లోని పెద్ద కంపెనీలపై కూడా పడింది. అక్కడ కూడా విదేశీ టాలెంట్ ను నియమించుకోవడానికి వెనకడుగేస్తున్నాయి. దీని కారణంగా వెనకడుగు వేస్తున్నాయనేందుకు నిదర్శనం. ఈ నాలుగు కంపెనీలు వెనక్కి తగ్గడం వల్ల అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ STEM గ్రాడ్యుయేట్లు, ఇతర భారతీయ నిపుణులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. పోటీ కూడా భయంకరంగా పెరిగింది. దీనిపై యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోరాడుతోంది. ఇది కోర్టులో ట్రంప్్పై దావా వేసింది. కానీ ఈ కేసు ఇంకా నడుస్తోంది.. ఎప్పటికి తేలుతుందో కూడా తెలియదు. మరోవైపు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇప్పటికే 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన H-1B వీసా క్యాప్‌ను అంటే సాధారణ, అడ్వాన్స్‌డ్ డిగ్రీ కోటకు చేరుకుందని తెలుస్తోంది.
Also Read: LUKOIL: ఆస్తులు అమ్మకుంటున్న రష్యా చమురు సంస్థలు..ట్రంప్ ఆంక్షల ఎఫెక్ట్
Follow Us