Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్

భారత్ లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచమంతా చూసిందని, జమ్మూకశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు జరిపిన దాడిగానే పరిగణించాల్సిందేనని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.

New Update
SCO Council of Foreign Ministers Meeting

SCO Council of Foreign Ministers Meeting

Jai Shankar:  భారతదేశంలో ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచమంతా చూసిందని, జమ్మూకశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడిగానే పరిగణించాల్సిందేనని  భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనేవి మూడు దుష్టశక్తులని ఆయన అన్నారు. మంగళవారం నాడిక్కడ జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశంలో ఆయన ప్రస్తావించారు. ఈ మూడు దుష్టశక్తులపై పోరాటమే ఎస్‌సీఓ ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటని గుర్తుచేశారు. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించిందని చెప్పారు. ఉగ్రవాదానికి పాల్పడుతూ, ప్రోత్సహిస్తున్న శక్తులను చట్టం ముందుకు తీసుకురావాలనే ఇండియా దృఢ సంకల్పాన్ని యూఎన్ పునరుద్ఘాటించిందని అన్నారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడమనే సందేశం ఎస్‌సీఓ సమావేశం బలంగా నొచ్చిచెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇది కూడా చూడండి:  Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ


ఆప్ఘనిస్థాన్‌ సుస్థిరత, సంక్షేమం కోసం భారత్ చాలా కాలంగా కట్టుబడి ఉందని, ఆప్ఘన్ అభివృద్ధికి ఎస్‌సీఓ సభ్యదేశాలు మరింత సహకారం అందించాలని జైశంకర్ సూచించారు. గ్లోబల్ అఫైర్స్‌లో తమ ప్రభావాన్ని విస్తరించుకునేందుకు సభ్యదేశాలు సమష్టిగా షేర్డ్ ఎజెండాతో ముందుకు వెళ్లాలని అన్నారు. సమష్టి సామర్థ్యంతోనే ఎస్‌సీఓ విజయాలు సాధిస్తుందన్నారు. ఆర్థిక సహకారం కూడా చాలా కీలకమని, ఎస్‌సీఓ ప్రాంతంలో రవాణా మార్గాలు లేకపోవడం వంటి అవరోధాల కారణంగా వాణిజ్యం, ఇన్వెస్ట్‌మెంట్‌పై ప్రభావం చూపుతుందన్నారు. ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (INSTC)ని ప్రమోట్ చేసేందుకు సభ్యదేశాలు దృష్టి సారించాలని మంత్రి జైశంకర్ సూచించారు.

Also Read : భట్టికి బిగ్‌ షాక్‌..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్‌ నోటీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు