పసిఫిక్‌ పాలిసాడ్స్‌ కార్చిచ్చు..ఆహుతైన Holly wood స్టార్ల ఇళ్లు!

లాస్‌ ఏంజెలెస్‌లో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.దాదాపు 3000 ఎకరాలు దగ్ధమయ్యాయి. రాత్రి సమయంలో గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.

New Update
pacific

pacific

అమెరికాలో కుబేరులకు ఆవాసాలైన మూడు నగరాల్లో లాస్‌ ఏంజెలెస్‌ ఒకటి.ఇప్పుడు ఆ సిటీలోని అత్యంత ఖరీదైన ప్రదేశాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది.దీంతో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇక్కడ సంపన్న వర్గాలు నివసించే ది పాలిసాడ్స్‌ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది.

దాదాపు 3000 ఎకరాలు దగ్ధమయ్యాయి. దీంతో 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది తమ సామగ్రి,వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి తరలివెళ్లారు. వీధుల్లో పొగ కమ్మేసింది. మరోవైపు ఒక్కసారిగా ప్రజలు రోడ్ల పైకి రావడంతో చాలా చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక్కడ కొండలపై ఉన్న రహదారులు ఇరుగ్గా ఉంటాయి.

Also Read: Delhi: ఢిల్లీ ఎలక్షన్స్‌  తర్వాత హిమాలయాలకు పోతా..సీఈసీ రాజీవ్ కుమార్

గంటకు 100 మైళ్ల వేగంతో..

దీనికి తోడు గాలులు ఎక్కువగా వీయడంతో మంటలు తొందరగా వ్యాపిస్తున్నాయి. రాత్రి సమయంలో  గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.

కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్ స్పందిస్తూ చాలా నిర్మాణాలు కాలిపోయాయి. మరికొన్ని చోట్ల కూడా కార్చిచ్చులు పుట్టొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 13,000 నిర్మాణాలకు కార్చిచ్చు ముప్పున్నట్లు లాస్‌ ఏంజెలెస్ అగ్నిమాపక అధికారి క్రిస్టీన్‌ క్రావ్లీ చెప్పారు. 

Also Read: Trump: అమెరికాలో విలీనమయ్యే అవకాశమే లేదు..ట్రంప్‌ కి ట్రూడో కౌంటర్‌!

బెవర్లీ హిల్స్‌, హాలీవుడ్‌ హిల్స్‌ , మలిబు, శాన్‌ ఫెర్నాండో ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి ఫైర్‌ అలర్ట్‌ లెవల్స్ ను పెంచారు. దాదాపు 62,000 మంది ప్రజలు కొన్ని గంటలుగా విద్యుత్తు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మంటలను ఆర్పడానికి విమానాలు, హెలికాప్లర్లు, బుల్డోజర్లను అధికారులు రప్పించారు.  

హాలీవుడ్‌ స్టార్ఉ టామ్‌ హాంక్స్‌,రీస్ విథర్స్పూన్, స్పెన్సర్‌ ప్రాట్‌ హెడీ మోంటాగ్‌ వంటి నటుల ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. మరికొందరి ఇళ్లు కూడా అగ్నికీలలకు సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: Musk: భారత్, చైనా దేశాల్లో జనాభా క్షీణత.. ఎలాన్‌ మస్క్‌ ఆందోళన

Also Read: Open Ai: ఓపెన్‌ ఏఐ సీఈఓ పై లైగింక వేధింపుల ఆరోపణలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు