Heavy Rains: భారీ వర్షాలు.. 300 మంది మృతి

పాకిస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పొటెత్తడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. జూన్‌ 26 నుంచి ఇప్పటివరకు కురుస్తున్న వర్షాలకు దాదాపు 300 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.

New Update
Heavy rains in Pakistan

Heavy rains in Pakistan

పాకిస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పొటెత్తడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. జూన్‌ 26 నుంచి ఇప్పటివరకు కురుస్తున్న వర్షాలకు దాదాపు 300 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వరదల ప్రభావానికి అక్కడి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి.  పాకిస్థాన్ విపత్తు నిర్వహణ సంస్థ దీనికి సంబంధించి వివరాలు వెల్లించింది. 

Also read: నిమిషా ప్రియా కేసులో బిగ్‌ట్విస్ట్.. ఉరిశిక్ష అమలుచేయాలని డిమాండ్

పాక్‌లో జూన్ 26 నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటిదాకా 299 మంది మృతి చెందారని తెలిపింది. వీళ్లలో 140 మంది చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది. ఈ వర్షాల ప్రభావానికి దేశవ్యాప్తంగా 715 మంది గాయపడ్డట్లు తెలిపింది. వీళ్లలో 239 మంది చిన్నారులు, 204 మంది మహిళలు, 272 మంది పురుషులు ఉన్నట్లు చెప్పింది. అయితే రుతుపవనాలు పాక్‌లో ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 1676 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 562 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. అంతేకాదు 428 మూగజీవాలు కూడా మృతి చెందాయి. ఇక రానున్న 3 రోజులు కూడా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

ఇదిలాఉండగా భారత్‌లో కూడా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో వరదలు పోటెత్తాయి. గత కొన్నిరోజుల నుంచి మధ్యప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావానికి ఇప్పటిదాకా 252 మంది మంది మృతి చెందారు. అలాగే 254 రోడ్లు దెబ్బతిన్నాయి. చాలా జంతువులు వరదల్లో కొట్టుకుపోయాయి. దాదాపు 3 వేల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  భోపాల్, గ్వాలియర్, జబల్పూర్‌, ధార్‌ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 

Also read: అమెరికా పెట్టుబడుల వీసాలకు డిమాండ్‌.. ఆసక్తి చూపుతున్న భారతీయులు

మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ, యూపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌లో రాబోయే అయిదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ఢిల్లీలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు,  బిహార్‌లోని  పాట్నా, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గయ,  నవాడ, ముజఫర్‌పూర్, సివాన్ పూర్తియా, భాగల్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక రాజస్థాన్‌లోని బుండి,  మాధోపూర్, కరౌలి, బరాన్, కోట, అల్వార్, దౌసా, సవాయిలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తాజాగా హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు