/rtv/media/media_files/2025/09/26/trump-h1b-visa-2025-09-26-10-00-08.jpg)
visa
US Education: అమెరికా వెళ్లి చదవాలనుకునే భారతీయ విద్యార్థులు తక్కువగా ఆసక్తిగా చూపిస్తున్నారు. వీసా నిబంధనలు, ఉపాధి అవకాశాలు తగ్గడం, ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల అమెరికా యూనివర్సిటీలు కాకుండా యూరప్‌వైపు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత రెండేళ్లలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 63 శాతం తగ్గినట్లు జాన్‌ధన్ సంస్థ తెలిపింది. భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు అమెరికాను వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారు 2023లో 54 శాతం మంది ఉన్నారు. అదే ఈ ఏడాది 20 శాతానికి పడిపోయినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: హద్దులు మీరుతున్న పాకిస్తాన్...ఆఫ్ఘాన్ బోర్డర్‌పై దాడి..ముగ్గురు క్రికెటర్లతో సహా 8మంది మృతి
వీసా విషయంలో కఠిన నిబంధనలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి వీసా విషయంలో కఠిన నిబంధనలు వచ్చాయి. ఖర్చులు పెరగడం, విద్య పూర్తి అయిన తర్వాత ఉపాధి అవకాశాలు పెద్దగా లేకపోవడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు యూరప్ వైపు వెళ్తున్నారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులు జర్మనీ, ఐర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. యూరప్ దేశాల్లో ఖర్చులు తక్కువగా ఉన్నాయని, జాబ్‌లు కూడా వస్తాయని అందుకే ఎక్కువ మంది వెళ్తున్నారని తెలుస్తోంది. అయితే గతంలో జర్మనీ వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య 4శాతం ఉండగా.. ఇప్పుడు 9 శాతానికి పెరిగింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులు 39 శాతం మంది బ్రిటన్ ఎంచుకుంటున్నారని తెలిపింది.
ఇది కూడా చూడండి: Trump On Pak-Afghan War: ఆ రెండు దేశాల మధ్యా యుద్ధం ఆపడం నాకు చాలా తేలిక..ట్రంప్