/rtv/media/media_files/2025/10/18/trump-2025-10-18-09-39-27.jpg)
ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్ ఇప్పుడు తొమ్మిదో యుద్ధాన్ని ముగించడానికి సిద్ధమయ్యారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య జరుగుతున్న వార్ గురించి ట్రంప్ మాట్లాడారు. దానిని పరిష్కరించడం తనకు సులభమైన పని అన్నారు. అంతేకాదు లక్షలాది మంది ప్రాణాలను కాపాడటం అంటే తనకు ప్రేమని..నోబెల్ కోసమే తాను యుద్ధాలను ఆపలేదని మరోసారి చెప్పుకున్నారు. శుక్రవారం మీడియా హౌస్‌లో పాక్, ఆఫ్ఘాన్ వార్ గురించి మాట్లాడారు.
ప్రాణాలను కాపాడ్డం కోసం..
నాకు నోబెల్ బహుమతి రాలేదు కానీ...శాంతి విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగేయని ట్రంప్ మరోపారి ఉద్ఘాటించారు. రువాండా, కాంగోలకు వెళ్ళి అడగండి...తాను పరిష్కరించిన యుద్ధాలన్నీ చూడండి..కావాలంటే రుజువుగా అంటూ చెప్పుకొచ్చారు. నోబెల్ బహుమతి వచ్చిన మహిళ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఆమె నా గురించి అర్థం చేసుకుంది. అందుకే పీస్ బహుమతి ప్రకటించగానే నాకు ఫోన్ చేసి నేను అర్హుడునని చెప్పింది అన్ని ట్రంప్ అన్నారు. అయినా నాకు ఆ విషయాలన్నీ పట్టవని...ప్రాణాలు కాపాడ్డం మీదనే శ్రద్ధవహిస్తానని తెలిపారు. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘన్‌ల మధ్య యుద్ధం ఆపితే..తొమ్మిదవ అవుతుంది. ఇంత వరకు ఏ అధ్యక్షుడూ ఇన్ని వార్‌లను ఆపిందిలేదు. బుష్ ఒక యుద్ధాన్ని ప్రారంభించాడు...నేను పది లక్షల ప్రాణాలను కాపాడాను అని ట్రంప్ చెప్పారు.
"Pakistan attacked.. Afghanistan. Easy one for me to solve it..", says US President Donald Trump pic.twitter.com/vpXBZk6M84
— Sidhant Sibal (@sidhant) October 17, 2025
మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆహ్వానించారు. ట్రంప్ తమ మధ్య యుద్ధాన్ని ఆపడం స్వాగతించదగినదని అన్నారు. వార్‌లను ఆపిన మొదటి అధ్యక్షుడు ట్రంప్ అని కొనియాడారు. అంతకు ముందు ఉన్న వారు సంఘర్షణకు ఆజ్యం పోశారని చెప్పారు.
అయితే పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిసతాన్ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తోంది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నా దాడులు చేసతోంది. అర్థరాత్రి వైమానికి దాడులు పాల్పడుతూ చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా నిన్న పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్‌లో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది చనిపోయారు. వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే ట్రైసీరీస్ కోసం క్రికెటర్లు పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు ప్రయాణించారని ఆఫ్ఘనిస్తాన్ బోర్డు తెలిపింది. వారు ముగ్గురూ బీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌లని వెల్లడించింది. వీరితో పాటూ దాడిలో మరో ఐదుగురు వ్యక్తులు కూడా మరణించారు. ఉర్గున్‌లో క్రికెటర్లు అందరూ కలుస్తారని తెలిసే పాకిస్తాన్ దాి చేసిందని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. దీనిని పిరికి దాడని అభివర్ణించింది. ఈ దాడి తర్వాత ట్రై సీరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగిందని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది.
Also Read: USA: జెలెన్ స్కీ, ట్రంప్ భేటీ..తోమహక్ క్షిపణుల నిరాకరణ
Follow Us