BIG BREAKING: హద్దులు మీరుతున్న పాకిస్తాన్...ఆఫ్ఘాన్ బోర్డర్‌పై దాడి..ముగ్గురు క్రికెటర్లతో సహా 8మంది మృతి

పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడింది. వైమానిక దాడులు చేసింది. ఇందులో ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది మరణించారు. పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే ట్రైసీరీస్ కోసం క్రికెటర్లు ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది.

New Update
afghan cricketers

పాకిస్తాన్ హద్దులు మీరుతోంది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నా ఆఫ్ఘనిస్థాన్ మీద దాడులు చేస్తోంది. తాజాగా పాక్టికా ప్రావిన్స్‌లో వైమానికి దాడిచేసింది. ఇందులో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ర్లు మరణించారు.వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే ట్రైసీరీస్ కోసం క్రికెటర్లు పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు ప్రయాణించారని ఆఫ్ఘనిస్తాన్ బోర్డు తెలిపింది. వారు ముగ్గురూ బీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌లని వెల్లడించింది. వీరితో పాటూ దాడిలో మరో ఐదుగురు వ్యక్తులు కూడా మరణించారు. ఉర్గున్‌లో క్రికెటర్లు అందరూ కలుస్తారని తెలిసే పాకిస్తాన్ దాి చేసిందని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. దీనిని పిరికి దాడని అభివర్ణించింది. ఈ దాడి తర్వాత ట్రై సీరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగిందని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. 

అర్థరాత్రి దొంగ దాడులు..

కాల్పుల విరమణను ఉల్లంఘించి మరీ పాకిస్తాన్ అర్థరాత్రి దాడులకు పాల్పడిందని కాబూల్ ఆరోపించింది. దీనిపై తప్పక ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పింది. పాక్టికాలో ఏకంగా మూడు ప్రదేశాలపై పాకిస్తాన్ వైమానికి దాడులు చేసింది. ప్రతీకార కాల్పులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని...తాలిబన్ దళాలు బోర్డర్‌ పోస్టుల వెంబడి దాడి చేస్తున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ తాలిబన్ అధికారి తెలిపారు. సామాన్య ప్రజల నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేయడం అన్యాయమని అన్నారు. అయితే వైమానిక దాడులకు సంబంధించి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.     

దాడుల్లో చనిపోయిన ముగ్గురు క్రికెటర్లు చాలా చిన్న వారని.ఇప్పుడిప్పుడే వారు అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్నారని ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆ దేశ సీనియర్ క్రికెటర్ రషీద్ ఖాన్ చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. యంగ్ క్రికెటర్లు చనిపోవడం చాలా బాధకరమని అన్నారు. 

Also Read: Mehul Choksi : మెహుల్ చోక్సీ భారత్ కు అప్పగింత..ఒప్పుకున్న బెల్జియం

Advertisment
తాజా కథనాలు