Putin: ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్..ప్లుటోనియం డీల్ క్యాన్సిల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్ లు మీద షాకులు ఇస్తున్నారు. రెండు రోజుల క్రితం బూరెవెస్ట్‌నిక్ అనే మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. తాజాగా అమెరికాతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

New Update
Donald Trump Conter Attack to Putin on israel-iran war

Donald Trump Conter Attack to Putin on israel-iran war

ట్రంప్, పుతిన్ లు ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపడం లేదని ట్రంప్ రష్యా అధ్యక్షుడిపై కోపంగా ఉన్నారు. దీనిని మరింత ఎక్కువ చేస్తూ పుతిన్ ఆయనకు షాకిచ్చారు. అమెరికాతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు.   దీనిపై తాజాగా పుతిన్ సంతకం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆగి ఉన్న అణు అగ్గి రాజుకున్నట్టయింది. 

ప్లుటోనియం డీల్..

రష్యా దగ్గర అణు సామర్థ్యానికి, అణ్వాయుధాల తయారీకి సంబంధించిన మూల పదార్ధం చాలానే ఉంది. దానిని అడ్డం పెట్టుకునే ఇన్నాళ్ళుగా మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. రష్యా కనుక అణు శక్తిని వాడడం మొదలుపెడితే ఆపడం ఎవ్వరి తరమూ కాదు. అందుకే అగ్రరాజ్యం అమెరికా ముందు జాగ్రత్తగా 2000 సంవత్సరంలో రష్యాతో ది ప్లుటోనియం మేనేజ్‌మెంట్‌ అండ్‌ డిస్‌పొజిషన్‌ అగ్రిమెంట్‌ ను కుదుర్చుకుంది. దీని ప్రకారం యుద్ధాలు జరుగుతున్నప్పుడు త దగ్గర నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లుటోనియాన్ని అణ్వాయుధాల తయారీకి కాకుండా..కేవలం పౌర అణు విద్యుత్ కోసం మాత్రమే వాడాలి. ఈ ఒప్పందాన్ని 2010లో మళ్ళీ సవరించారు కూడా.  దీని ద్వారా దాదాపు 17 వేల అణ్వాయుధాల తయారుకాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని అమెరికా లెక్కలు వేసింది. అయితే ఈ ఒప్పందానికి 2016లోనే గండి పడింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రష్యాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ వెంటనే పుతిన్ కూడా ప్లుటోనియం ఒప్పందాన్ని నిలిపివేశారు. తాజాగా దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.  

బూరెవెస్ట్‌నిక్ మిసైల్‌...

అయితే ఇఫ్పుడు ఈ ఒప్పందాన్నే పుతిన్ మడిచి పక్కన పడేశారు. దాన్ని రద్దు చేస్తున్నట్టు సంతకాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా  బూరెవెస్ట్‌నిక్ అనే మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు. ఇది అణుశక్తితో నడుస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బూరెవెస్ట్‌నిక్ క్షిపణి మోహరింపునకు మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని సాయుధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు.  ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవల రష్యా ఆర్మీ అణు విన్యాసాలు నిర్వహించింది. వీటిని స్వయంగా పుతిన్ పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలోనే రష్యా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, ఇతర సైనిక కమాండర్లతో ఆయన ఓ మీటింగ్ నిర్వహించారు. అయితే పరీక్షలు చేసిన సమయంలో ఆ క్షిపణి 15 గంటల పాటు గాల్లోనే ఉందని కమాండర్లు చెప్పారు. ఏకంగా 14 వేల కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిపారు. 

Also Read: MONTHA EFFECT: తీవ్ర తుఫానుగా బలపడిన మొంథా..ఆగిపోయిన విమాన రాకపోకలు

Advertisment
తాజా కథనాలు