Water Bomb: వాటర్ బాంబ్ తో భారత్ కు ఏం ప్రమాదం లేదు..చైనా

బ్రహ్మపుత్రానది ఎగువ భాగంలో చైనా అతిపెద్ద ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీని గురించి భారత్, భంగ్లాదేశ్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అలాంటి భయాలేవీ అక్కర్లేదని చైనా చెబుతోంది. దీనివలన ఎవరికీ నష్టం కలగకుండా చూసుకుంటామని హామీ ఇస్తోంది.

New Update
China Dam

China Mega Dam

ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా శనివారం ప్రారంభించింది. దీని వల్ల సరిహద్దులోని అరుణాచల్‌, అస్సాం రాష్ట్రాలకు ముప్పు పొంచిఉంది. అందుకే కొంతమంది చైనా వాటర్ బాంబ్ అని పిలుస్తున్నారు. దీని కోసం రూ.14 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. విద్యుత్తును భారీగా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును టిబెట్‌లోని నైంగ్చి నగరంలో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సంవత్సరానికి 300 బిలియన్‌ కిలోవాట్‌-అవర్స్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. టిబెట్‌లోని యార్లంగ్‌ జాంగ్సో (బ్రహ్మపుత్ర) నదిపై ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. అయితే దీని విషయంలో భారత్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.  బ్రహ్మపుత్రానది ఎగువ భాగంలో ప్రాజెక్టు నిర్మిస్తే..దిగువ ఉన్న ప్రాంతాలకు నీటి సరఫరా తగ్గుతుందని ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఎవరికీ నష్టం ఉండదు..

అయితే మెగా డ్యామ్ వలన భారత్ కు ఎటువంటి ప్రమాదం లేదా నష్టం లేదని చైనా అంటోంది. టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది మీద.. జలవిద్యుత్తు ప్రాజెక్టు కోసం.. జలాశయం నిర్మించడాన్ని డ్రాగన్ కంట్రీ సమర్ధించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మపుత్ర వాటర్ ను మళ్ళించమని చెబుతోంది. ఇంకే రకంగా కూడా ఈ నీళ్లను వినియోగించుకోమని చైనా స్పష్టం చేసింది. డ్యాం నిర్మాణంపై ఆందోళన చెందనక్కర్లేదని చెప్పింది.  ఈ నది దిగువ ప్రాంతాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్‌ తెలిపారు. అయితే డ్యాం నిర్మాణ నిర్ణయం మాత్రం చైనా సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయమన్నారు. 

అయితే చైనా నిర్మిస్తున్న ఈవాటర్ బాంబ్ మీద పర్యావరణవేత్తలు కూడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సున్నితమైన టిబెటన్ పీఠభూమిలో ప్రాజెక్టులు నిర్మిస్తూ అనుహ్యమైన వాతావరణ మార్పులు కలుగుతాయని చెబుతున్నారు. భూకంపాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉందని చెబుతున్నారు. 

Also Read: USA: 200 మిలియన్ డాలర్లకు ట్రంప్ తో కొలంబియా యూనివర్శిటీ సెటిల్ మెంట్...తరువాత హార్వర్డేనా?

Advertisment
తాజా కథనాలు