USA: 200 మిలియన్ డాలర్లకు ట్రంప్ తో కొలంబియా యూనివర్శిటీ సెటిల్ మెంట్...తరువాత హార్వర్డేనా?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిధులు ఆపేసిన యూనివర్శిటీల్లో కొలంబియా ఒకటి. ఇప్పుడు ఆ యూనివర్శిటీ ట్రంప్ ప్రభుత్వంతో 200 మిలియన్లకు ఒప్పందం కుదుర్చుకుంది. మూడు ఏళ్ళకు ఈ అగ్రిమెంట్ కుదిరింది.

New Update
Columbia University

Columbia University

క్యాంపస్ లో యూదు విద్యార్థుల అనుమతి విషయంలో అమెరికాలోని యూనివర్శిటీలకు కండిషన్లు పెట్టారు అధ్యక్షుడు ట్రంప్. వీటికి కొలంబియా, హార్డర్డ్ యూనివర్శిటీలు అంగీకరించలేదు. దీంతో అమెరికా ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ ను ఆపేశారు. అయితే ఇప్పుడు ఇదే విషయంలో ట్రంప్ ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చింది కొలంబియా విశ్వవిద్యాలయం. మూడు ఏళ్ళకు గానూ 200 మిలియన్లను చెల్లించడానికి ఒప్పుకుంది దాంతో పాటూ ట్రంప్ పెట్టిన కండిషన్లను కూడా అంగీకరించింది. ఇందుకు గానూ ప్రభుత్వం రద్దు చేసిన 400 మిలియన్ల పరిశోధన గ్రాంట్లలో కొంత భాగాన్ని విడుదల చేయనుంది. ఈ ఒప్పందంలో US సమాన ఉపాధి అవకాశాల కమిషన్ (EEOC) దర్యాప్తులను పరిష్కరించడానికి అదనంగా $21 మిలియన్ల చెల్లింపు కూడా ఉంది.

హార్వర్డ్ సంగతేంటి?

అమెరికా ప్రభుత్వానికి, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఉన్న గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు హార్వర్డ్ మీద పగబట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. తాను చెప్పినట్టు వినలేదని ఇప్పటికే పలు ఆంక్షలు పెట్టిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా యూనివర్శిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి వీలు లేదంటూ రూల్ ను పెట్టింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విశ్వవిద్యాలయంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా దీన్ని అమలు చేస్తామని చెబుతోంది. యూదు వ్యతిరేకతను పెంపొందించడం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో చేతులు కలపడం లాంటి వాటిని యూనివర్శిటీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దాంతో పాటూ విదేశీ విద్యార్థుల నుంచి అధిక ఫీజులను వసూలు చేస్తోందని కూడా ఆరోపించారు. ఒకవేళ రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ముందు హార్వర్డ్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్‌ను తిరిగి పొందాలనుకుంటే, వారు "72 గంటల్లోపు" "అవసరమైన సమాచారాన్ని ముందుగానే తెలపాలని...అప్పుడు తాము అనుమతి ఇస్తేనే చేయాలని చెప్పారు.

ఇప్పుడు కొలంబియా యూనివర్శిటీ రాజీకి వచ్చిన క్రమంలో తరువాత హార్వర్డ్ వంతు అంటున్నారు. కొలంబియాలానే హార్వర్డ్ కూడా రాజీకి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే గ్రాంట్లు ఆగిపోయి, విద్యార్థుల రాక ఆ యూనివర్శిటీ ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోకతప్పదని అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు