US Green Card: వాళ్లకు నో గ్రీన్ కార్డు.. మరో షాక్ ఇచ్చిన ట్రంప్ సర్కార్!

అమెరికాలో గ్రీన్ కార్డ్‌ పొందడం వలసదారులకు అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే అమెరికాలో శాశ్వత నివాసానికి, తద్వారా పౌరసత్వం పొందడానికి అమెరికా పౌరసత్వం ఉన్నవారిని పెళ్లాడుతుంటారు. శాశ్వత నివాస కార్డు (గ్రీన్‌కార్డు) కోసం ఇండియన్స్ అమెరికా పౌరులను పెళ్లాడుతారు.

New Update
FotoJet (1)

New rules for foreigners and green card holders in America

Green Card: అమెరికా(america) లో గ్రీన్ కార్డ్‌(donald trump green card) పొందడం వలసదారులకు అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే అమెరికాలో శాశ్వత నివాసానికి, తద్వారా పౌరసత్వం పొందడానికి అమెరికా పౌరసత్వం ఉన్న వారిని పెళ్లాడుతుంటారు. శాశ్వత నివాస కార్డు(పర్మినెంట్‌ రెసిడెంట్‌ కార్డు) అయిన గ్రీన్‌కార్డు  కోసం విదేశీయులు ముఖ్యంగా భారతీయులు అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి కనపరుస్తారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారుల అంతిమ లక్ష్యం గ్రీన్‌కార్డు సాధించడమే అనేది అందరికీ తెలిసిందే. అయితే గ్రీన్‌కార్డు పొందినంత మాత్రాన అమెరికా గడ్డపై జన్మించిన పౌరులతో సమానం కాదు. అయినప్పటికీ పౌరులతో సమానంగా చాలావరకు హక్కులు లభిస్తాయి. తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డుకు డిమాండ్‌ పెరగడానికి ఇదే ప్రధాన కారణం. అయితే ఇకపై ఇది చెల్లుబాటు కాకపోవచ్చు. Trump Sensation On Green Card

విదేశీయులు అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని దక్కించుకోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. అమెరికా పౌరుడిని వివాహం చేసుకుంటే గ్రీన్ కార్డ్‌ దక్కుతుందనడానికి ఎటువంటి హామీ ఉండదని ఇమ్మిగ్రేషన్ అటార్నీ జనరల్ బ్రాడ్ బెర్న్‌స్టీన్ స్పష్టం చేయడమే దీనికి కారణం.  అమెరికన్‌ పౌరుడిని వివాహం చేసుకుంటే లభించే గ్రీన్‌ కార్డు వారి వివాహ ధృవీకరణ డాక్యుమెంట్‌ మాత్రమేనని బెర్న్‌స్టీన్ తేల్చి చెప్పారు. తమ దేశ పౌరుడి జీవిత భాగస్వామి అత్యంత సన్నిహిత బంధువుగా మాత్రమే గుర్తిస్తామని స్పష్టం చేశారు. అమెరికా పౌరుడు/పౌరు రాలి భార్య/భర్తకు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొనే అర్హత చట్ట ప్రకారం లభిస్తుంది.  వివాహం చేసుకుంటే సరిపోదని, దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు మరింత కఠినతరం చేయనున్నామని ఆయన హెచ్చరించారు. 

Also Read :  మొన్న బంగ్లాదేశ్, నేపాల్‌.. ఇప్పుడు ఇరాన్‌లో జెన్‌ జడ్‌ ఆందోళనలు..

No Green Card For Them - Trump Government

పెళ్లి.. గ్రీన్ కార్డ్‌(green card under trump) ను సంపాదించిపెట్టదని, కలిసి జీవించడానికి మాత్రమే సరిపోతుందని వ్యాఖ్యానించారు. దంపతులు ప్రతిరోజూ ఒకే ఇంట్లో కలిసి నివసించకపోతే.. ఆ వివాహం డాక్యుమెంట్ల వరకే పరిమితమైనట్లు భావిస్తామని బెర్న్‌స్టీన్ తేల్చి చెప్పారు. గ్రీన్ కార్డు కోసమే ఈ పెళ్లి జరిగినట్లు భావించాల్సి ఉంటుందని అన్నారు. కలిసి జీవించకపోతే గ్రీన్ కార్డ్ లేదా శాశ్వత పౌరసత్వాన్ని పొందడానికి దాఖలు చేసిన దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని వివరించారు. వివాహం ఆధారంగా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు.. ఇక్కడి చట్టపరమైన సలహాలను తీసుకోవడం తప్పనిసరి అని ఆయన  సూచించారు. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు వర్క్ పర్మిట్ చెల్లుబాటును అయిదేళ్ల నుంచి 18 నెలలకు తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డైవర్సిటీ వీసా లాటరీని సైతం రద్దు చేశామని వివరించారు.

గ్రీన్‌కార్డు(green card protectio) పొందాలంటే అమెరికా సిటిజెన్‌తో పెళ్లి చేసుకోవడం ఒక్కటే సరిపోదని చెప్పారు. వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు చాలా ఏళ్లుగా కలిసి జీవిస్తున్నట్లుగా నిర్ధారణ అయితేనే గ్రీన్‌ కార్డు పొందే వీలుంటుందని పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్‌ చట్టాలపై బెర్న్‌స్టీన్‌కు 30 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. దంపతులు వేర్వేరుగా జీవిస్తున్నట్లు తెలిస్తే గ్రీన్‌కార్డు దరఖాస్తును ప్రభుత్వం పక్కనపడేసే అవకాశం కూడా అధికంగా ఉందని ఆయన చెప్పారు. ఒకే ఇంట్లో కలిసికట్టుగా ఉంటేనే కార్డు అభించే అవకాశాలు ఉంటాయని చెప్పారు.

ఉద్యోగం, పిల్లల చదువులు వంటి కారణాలతో వేర్వేరుగా ఉంటున్నామని దంపతులు చెప్పినంత మాత్రాన అధికారులు వింటారనుకోవడం సరికాదని బెర్న్‌స్టీన్‌ స్పష్టంచేశారు. కలిసి ఉంటున్నట్లు వారికి విశ్వాసం కలిగించాలని పేర్కొన్నారు. దంపతులు నిత్యం ఒకే ఇంటిని పంచుకోవడం అనేది వివాహనికి నమ్మకమైన గుర్తింపుగా ఇమ్మిగ్రేషన్‌ చట్టాలు భావిస్తాయని ఆయన తేల్చి చెప్పారు.  పెళ్లి చేసుకుని దూరంగా ఉంటూ గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నించాలనుకుంటే తొలుత న్యాయ సహాయం తీసుకోవాలని స్పష్టంచేశారు. అమెరికా వీసాలు, గ్రీన్‌కార్డుల కోసమే అమెరికా సిటిజెన్‌ను పెళ్లి చేసుకున్నట్లు తేలితే కఠిన శిక్షలుంటాయని ఆయన హెచ్చరించారు.  

కాగా ట్రంప్‌(donald trump latest news about green card) అమెరికా పాలన పగ్గాలు చేపట్టాక వివాహం ఆధారిత గ్రీన్‌కార్డు(can trump take green card) దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ వివాహం అసలైనదేనా? కేవలం గ్రీన్‌కార్డు కోసమే పెళ్లి చేసుకున్నారా? దీనిలో దురుద్దేశం ఏదైనా ఉందా? అనే విషయాలను లోతుగా తనిఖీ చేస్తున్నారు. కేవలం కాగితాలపై జరిగిన పెళ్లి అని తేలితే దరఖాస్తులను తిరస్కరించడంతో పాటు శిక్షలు విధించాలని నిర్ణయించారు. ఇప్పటికే అమెరికా వీసాల జారీ కార్యక్రమాన్ని ట్రంప్‌ కట్టడి చేసిన సంగతి తెలిసిందే. డైవర్సిటీ వీసా(డీవీ) లాటరీని కూడా ఆయన రద్దు చేశారు. ఈ లాటరీ ద్వారా విదేశీయులకు ఏటా 50 వేల దాకా వీసాలు ఇచ్చేవారు. ప్రస్తుతం అవన్నీ ఆగిపోయినట్లేననే అధికారులు తేల్చి చెప్పారు.  ఇప్పటికే గ్రీన్‌కార్డు పొందిన 19 దేశాల ప్రజల నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలించాలని ట్రంప్‌ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో గ్రీన్‌ కార్డు పొందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. యూనస్‌పై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు