Nuclear Weapons: రష్యా, చైనా ఎఫెక్ట్.. అణ్వాయుధాల పరీక్షకు ట్రంప్ పచ్చ జెండా..

ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కవు అణ్వాయుధాలను కలిగి ఉందని అధ్యక్షుడు ట్రంప్  అన్నారు. తమ దేశం వెంటనే అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు. 

New Update
_Trump D

యునైటెడ్ స్టేట్స్ వద్ద మరే ఇతర దేశం కంటే ఎక్కువ అణ్వాయుధాలు లేవు. నా మొదటి పదవీ కాలంలో ఇది సాధించామని ట్రంప్ చెప్పారు. ఇందులో ఆయుధాల పూర్తి నవీకరణ, పునరుద్ధరణ కూడా ఉందని తెలిపారు. అయితే ఇన్ని ఉన్నా తాము అణ్వాయుధాలను  ఎప్పుడూ పరీక్షించాలని అనుకోలేదని..అదొక అపారమైన విధ్వంసమని..అందుకే తాను ఇష్టపడలేదని ట్రంప్ చెప్పారు. కానీ ఇప్పుడు తమకు మారూ మార్గం కనిపించడం లేదన్నారు. అందుకే తక్షణమే అణ్వాయుధ పరీక్షలకు అదేశాలు జారీ చేశానని తెలిపారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అణ్వాయుధాల పరీక్షలో రష్యా రెండవ స్థానంలో, చైనా ఐదవ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. 

రష్యా, చైనాల వల్లనే..

రష్యా, చైనాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్న కారణంగానే తాను కూడా మా దేశ ఆయుధాలను పరీక్షించాల్సిందిగా రక్షణశాఖకు ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభం అవుతుందని తెలిపారు. ముఖ్యంగా రష్యా ఇటీవల రెండు అణుశక్తితో పనిచేసే ఆయుధాలను పరీక్షించింది. 9M730 బ్యూరెవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణి , పోసిడాన్ నీటి అడుగున డ్రోన్..ఇవి రెండూ పుదూర ప్రాంతాలకు కూడా పేలోడ్ ను మోయగలవు. వీటిని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఈ ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యతిరేకత ప్రకటించారు. రష్యాకు ఇది తగదని అన్నారు.   

Also Read: Trump Comments On Modi: చాలా మంచివారు..కానీ కఠినాత్ముడు..ప్రధాని మోదీపై ట్రంప్ వ్యాఖ్యలు 

Advertisment
తాజా కథనాలు