కాల్పుల ఒప్పందానికి అంగీకరిస్తాం.. కానీ : నయీం ఖాసీం

హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌ నయీం ఖాసీం కీలక ప్రకటన చేశారు. సరైన ప్రతిపాదన జరిగితే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. బుధవారం ఓ వీడియో సందేశంలో ఖాసీం మాట్లాడారు.

New Update
Hezbollah

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌ నయీం ఖాసీం కీలక ప్రకటన చేశారు. సరైన ప్రతిపాదన జరిగితే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. బుధవారం ఓ వీడియో సందేశంలో ఖాసీం మాట్లాడారు. ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు హెజ్‌బొల్లా సిద్ధంగా ఉందని అన్నారు. ఇజ్రాయెల్ ఒకవేళ ఆమోదయోగ్యమైన, అనుకూలమైన ప్రతిపాదనను తీసుకొస్తే.. కాల్పుల విరమణ గురించి ఆలోచిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్ దూకుడును ఆపేయాలని నిర్ణయించుకుంటే.. మేము దానికి అంగీకరిస్తామని చెబుతామని, అది కూడా మాకు ఆమోదయోగ్యంగా ఉండాలని అన్నారు. 

Also Read: ఖలిస్థానీ దాడుల వెనుక అమిత్‌ షా హస్తం?.. సంచలనం రేపుతున్న ఆరోపణలు

అడ్డుక్కునే ఉద్దేశం లేదు

శత్రుత్వం తీవ్రమవుతున్న వేళ.. చర్చలతో కూడిన శాంతి ఆచరనీయమైన శాంతిగా మారొచ్చని వ్యాఖ్యానించారు. అలాగే హెజ్‌బొల్లా అనేది కాల్పుల విరమణ ఒప్పందం కోసం అడుక్కోదని స్పష్టం చేశారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి రాజకీయ ప్రయత్నాలు ఇంతవరకు ఫలితాలను ఇవ్వాలని పేర్కొన్నారు. నయీం ఖాసీం చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులను ఆపేస్తే తాము కాల్పుల ఒప్పందం గురించి ఆలోచిస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఖాసీం చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. 

Also Read: ఇజ్రాయెల్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఇతను ఎవరో తెలుసా?

ఇటీవల ఇజ్రాయెల్ దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హెజ్‌బొల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన నయిం ఖాసీం ఈ గ్రూప్‌కు కొత్త చీఫ్‌గా ఎంపికయ్యారు. దీంతో ఇటీవలే ఇజ్రాయెల్ మరో హెచ్చరిక చేసింది. కొత్త చీఫ్‌ కూడా ఎక్కువ కాలం ఉండడని ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య 60 రోజుల కాల్పుల విరమణ కోసం అమెరికా మధ్యవర్తులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందుకోసం సీనియర్ దౌత్యవేత్తలు పశ్చిమాసియాకు వస్తున్నారు. కానీ ఇది ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా కొత్త చీఫ్ నయిం ఖాసీంకాల్పుల విరమణ ఒప్పందంపై ఈ ప్రకటన చేయడం ప్రాధన్యం సంతరించుకుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు