ఇజ్రాయెల్ వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఇతను ఎవరో తెలుసా? 30 సంవత్సరాలకు పైగా హిజ్బుల్లా సీనియర్ నాయకత్వంలో ఖాస్సెమ్‌కు హిజ్బుల్లా కొత్త చీఫ్ బాధ్యతలు అప్పగించడంతో ఇజ్రాయెల్ కాస్త డిఫెన్స్‌లో పడింది. 30 సంవత్సరాలకు పైగా హిజ్బుల్లా సీనియర్ నాయకత్వంలో ఖాస్సేమ్ భాగంగా ఉన్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Archana 31 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update Hezbollah షేర్ చేయండి Hezbollah New Chief: షేక్ నయీమ్ ఖాస్సెమ్.. ఇప్పుడీ పేరు పశ్చిమాసియాలో మారుమోగుతోంది. హిజ్బుల్లాను ఏళ్ల పాటు ఏలిన నస్రల్లా హత్య తర్వాత దిక్కులేనిదిగా మారిన ఆ సంస్థకు కొత్త నాయకుడిగా నయీమ్ ఖాస్సెమ్ ఎన్నికవడం సర్వత్రా చర్చకు దారి తీసింది. అసలు ఖాస్సెమ్ ఎవరు? భూకాంక్షతో విర్రవీగుతూ సరిహద్దు దేశాలపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆటలకు ఖాస్సెమ్ చెక్ పెట్టగలరా? హిజ్బుల్లా సీనియర్ నాయకత్వంలో ఖాస్సెమ్ షేక్ నయీమ్ ఖాస్సెమ్‌ను కొత్త అధిపతిగా ఎన్నుకున్నట్లు లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ప్రకటించింది. కొన్ని వారాల క్రితం దక్షిణ బీరుట్‌లో ఇజ్రాయెల్ దాడిలో సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లా మరణించిన తర్వాత గ్రూప్ హెడ్‌గా గతంలో డిప్యూటీ లీడర్‌గా పనిచేసిన నయీమ్ ఖాస్సేమ్‌ను ఎన్నుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. 30 సంవత్సరాలకు పైగా హిజ్బుల్లా సీనియర్ నాయకత్వంలో ఖాస్సెమ్ భాగంగా ఉన్నారు. నిజానికి నస్రల్లా హత్య తర్వాత అంతా సఫీద్దీన్ వైపు చూశారు. అతనే హిజ్బుల్లాను నడిపిస్తారని భావించారు. అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో సఫీద్దీన్ కూడా మరణించడంతో హిజ్బుల్లాకు దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా అయ్యింది. ఇలా చాలా రోజులగా నాయకుడే లేకుండా ఉన్న హిజ్బుల్లాకు నయీమ్ ఖాస్సెమ్ లీడర్‌గా ఎన్నికయ్యాడు.1953లో బీరుట్‌లో పుట్టారు నయీమ్ ఖాస్సెమ్. లెబనీస్ షియా అమల్ ఉద్యమంతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తర్వాత 1979లో అమల్‌ను విడిచిపెట్టాడు. 1982లో హిజ్బుల్లా ఏర్పాటైంది. 1991లో హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్‌గా ఖాస్సేమ్‌ను నియమించారు. హిజ్బుల్లా అప్పటి నాయకుడు అబ్బాస్ అల్-ముసావి, మరుసటి సంవత్సరం ఇజ్రాయెలీ హెలికాప్టర్ దాడిలో మరణించారు. ఆ తర్వాత నస్రల్లా నాయకుడిగా మారారు. ఇక ఆ సమయంలో హిజ్బుల్లా పార్లమెంటరీ ఎన్నికల ప్రచారాలను ఖాస్సెమ్ కోఆర్డినేట్ చేశారు. ఇజ్రాయెల్‌తో 2006 యుద్ధం తరువాత నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో హిజ్బుల్లాను రిప్రెజెంట్ చేసింది ఖాస్సెమే. నస్రల్లా, సఫీద్దీన్ లాగా కాకుండా ఖాస్సెమ్ తెల్లటి తలపాగా ధరిస్తారు. నిజానికి నల్లటి తలపాగాలు ముహమ్మద్ ప్రవక్త వారసులు మాత్రమే ధరిస్తారు. అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. అప్పటి నుంచి హిజ్బుల్లా ప్రముఖ ప్రతినిధిగా ఖాస్సేమ్ వ్యవహరిస్తున్నారు. ఇలా చిన్నస్థాయి నుంచి హిజ్బుల్లాలో అంచెలంచెలుగా ఎదిగారు ఖాస్సెమ్.పైకి సాఫ్ట్‌గా కనిపించినా ఖాస్సెమ్ అమాయకుడేమీ కాదంటారు హిజ్బుల్లాను వ్యతిరేకించేవారు. అనేకసార్లు మానవ హక్కులను ఆయన ఉల్లంఘించినట్టుగా చెబుతుంటారు. హిజ్బుల్లా హింసాత్మక చర్యలు, విధానాల్లో నయీమ్ ఖాస్సేమ్ పాత్ర కూడా ఉందంటారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీసే రాజకీయ వ్యూహాల్లో కూడా ఆయన పాత్ర ఉన్నట్టుగా సమాచారం. ఇది కూడా చూడండి: గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి