USA: మళ్ళీ వాయిదా పడ్డ ప్రయోగం..సునీతా విలియమ్స్ రాక ఇంకా ఆలస్యం

తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయారు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు. వారిని తొందరలోనే తీసుకువస్తామని స్పేస్ ఎక్స్, నాసాలు ప్రకటించాయి. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ సంకేతిక సమస్యల కారణంగా వారి రాక వాయిదా పడింది.  

author-image
By Manogna alamuru
New Update
space

Sunitha Williams Christmas Photograph: (NASA)

స్పేస్ లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ ల రాక మరింత ఆలస్యం అవనుంది. తొమ్మిది నెలలుగా వీరిద్దరూ అక్కడ ఉండిపోయారు. తాజాగా వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా-స్పేస్‌ఎక్స్‌లు క్రూ 10 మిషన్ ప్రయోగించాలనుకుంది. కానీ ఇప్పుడు అది వాయిదా పడింది.  అమెరికాలోని ఫలోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధమైంది. కానీ ఇందులో టెక్నికల్ ప్రాబ్లెమ్ రావడంతో ఇది నిలిచిపోయింది. హైడ్రలిక్ సిస్టమ్ లో సమస్య వచ్చిందని...అందుకే ప్రయోగాన్ని ఆపేస్తున్నామని నాసా తెలిపింది. దీనిని వెంటనే పరిష్కరించి మరో వారంలో ప్రయోగిస్తామని చెప్పింది. దీంతో వ్యోమగాముల రాక మరికొన్ని రోజులు ఆలస్యం అవనుంది. 

మరో వారం రోజులు లేట్..

అంతరిక్షంలో ఉండిపోయిన వ్యోమగాములను తీసుకురావాలంటే అక్కడకు మరి కొంత మందిని ముందు పంపించాలి. ఐఎస్ఎస్ లో బాధ్యతలను వారికి అప్పగించిన తర్వాతనే అక్కడ ఉండిపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను భూమి మీదకు తీసుకురాగలుగుతారు. కొన్ని రోజుల క్రితం సునీతా విలియమ్స్ మీడియాతో మాట్లాడారు. తమను తీసుకెళ్ళడం కోసం మార్చి 12న స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్షనౌక రానుందని, దానిలో కొత్తగా ఐఎస్‌ఎస్‌లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని చెప్పారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు తాము వస్తామని తెలిపారు. ఇప్పుడే అదే మరి కాస్త ఆస్యం అవనుంది.  

Also Read: Goa: నిజంగానే వెలవెలపోతున్న గోవా..కారణాలు ఇవే.. 

Advertisment
తాజా కథనాలు