Goa: నిజంగానే వెలవెలపోతున్న గోవా..కారణాలు ఇవే..

బాగా బీచ్, కలాంగుట్ బీచ్, అంజునా బీచ్‌లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారే గోవా ప్రస్తుతం డల్ గా అయిపోయింది. టూరిస్టులు తగ్గిపోయి ఇంతకు మునుపు వైభవం కోల్పోయి వెలవెలబోతోంది. దీని వెనుక చాలానే కారణాలున్నాయి అని చెబుతున్నారు. అవేంటో కింద ఆర్టికల్ లో..    

New Update
india

GOA

తాటి, కొబ్బరి చెట్లు, నీలిరంగు నీళ్ళు, బంగారు రంగు ఇసుక, ఆహ్లాదమైన రిసార్ట్ లు, నైట్ లైఫ్...ఇదీ గోవా. అందమైన లొకేషన్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో దేశ విదేశీ టూరిస్టులను ఆకట్టుకునే గోవా ఇప్పుడు వెలవెలబోతోంది. కొంతకాలంగా గోవా టూరిస్టుల సంఖ్య చాలా తగ్గిపోయిందని చెబుతున్నారు. దీని వెనుక చాలానే కారణాలున్నాయని చెబుతున్నారు.

సగానికి పడిపోయిన టూరిజం..

CEIC రిపోర్టు ప్రకారం..2019లో 85లక్షలున్న విదేశీ టూరిస్టులు 2023లో గోవాకు కేవలం 15లక్షలకు తగ్గారు. లాస్ట్ ఇయర్ కు ఈ సంఖ్య మరికాస్త తగ్గింది. కొన్నాళ్ళ క్రితమే దీనికి సంబంధించిన వార్తలు వచ్చినప్పటికీ...ఏమీ లేదని గోవా ప్రభుత్వం వాదించింది. కానీ ఇప్పుడు మళ్ళీ గోవాకు వచ్చే టూరిస్టుల సంఖ్య తగ్గిందంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఆగ్నేసియాలో మరింత అభివృద్ధి చెందిన,   తక్కువ ధరలకే కొత్త ప్రదేశాలు చూసే అవకాశం కలగడమే అంటున్నారు. దానికి తోడు ఆర్ధిక మాంద్యం కూడా గోవా టూరిజాన్ని తగ్గిస్తోందని తెలుస్తోంది. 

గోవాకు విదేశీ టూరిస్టులు రావడం బాగా తగ్గిపోయింది. దానికి కారణం వాయగొడుతున్న ధరలే కారణమని చెబుతున్నారు. గోవాలో అకామిడేషన్, ట్రావెల్ ఛార్జీలు లాంటివే కాకుండా ఆటో మాఫియా ఒకటి చాలా ఎక్కువైపోయిందని చెబుతున్నారు. గోవా ట్యాక్సీ కంపెనీలు చార్జీలు పెంచడం, మీటర్లు లేకపోవడం, అందించే కొన్ని సంస్ధలు పర్యాటకులను అడ్డగోలు ఛార్జీలతో దోచుకోవడం, విదేశీయుల దగ్గర మరింత దోచుకోవాలనే దురాశలు అక్కడ టూరిజాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి. గోవా విమాన ఛార్జీలు కూడా చాలా పెరిగిపోయాయి. దీంతో గోవాకు టూరిస్టులు వచ్చేందుకు ఒకటిరెండు సార్లు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అంతేకాదు ఒకప్పుడు టూరిస్టులను రారమ్మని పిలిచే గోవా బీచ్ లు ఇప్పుడు సందర్శకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. బీచ్ లను నీట్ గా మెయింటెయిన్ చేయకపోవడం కూడా దీనికి కారణంగా మారుతోంది. 

గోవా టూరిజం తగ్గిపోతే భారతదేశం ఎకానమీ మీద చాలా ప్రభావమే చూపిస్తుంది. ఇక్కడ విదేశీ పర్యాటక రంగం క్షీణించడంతో పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారు. మళ్ళీ గోవాకు జనాలను రప్పించాలంటే ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డాయి అక్కడి ప్రభుత్వం, కంపెనీలు. దీనికోసం విమానాశ్రయాలలో ల్యాండింగ్ ఖర్చులు,వీసా ఫీజులు తగ్గించడం, వీసా- ఆన్ -అరైవల్ విధానాన్ని క్రమబద్ధీకరించడం వంటి విధానాల కోసం పరిశ్రమలోని నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.

Also Read: Hydrogen Train: ఈ నెల 31 నుంచే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు...ఎక్కడినుంచెక్కడికో తెలుసా..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు