Myanmar: ఆ విలయం ..334 అణుబాంబుల విధ్వంసంతో సమానం!

మయన్మార్‌ తో పాటు థాయ్ లాండ్‌ లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అధికారులు వెల్లడించారు.

New Update
Earthquake in Myanmar

Earthquake in Myanmar

Myanmar: మయన్మార్‌ తో పాటు థాయ్ లాండ్‌ లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఙన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు.ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

Also Read: Telangana Rain Alert: మండుతున్న ఎండల్లో చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..రానున్న మూడు రోజుల పాటు వానలే వానలు!

భారత టెక్టానిక్‌ ఫలకాలు యూరేషియన్ ప్లేట్స్ ను వరుసగా ఢీకొంటుండడం వల్లనెలల తరబడి ఆఫ్టర్‌ షాక్స్‌ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్‌ తెలిపారు. దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా మయన్మార్‌ విపత్తు మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. కమ్యూనికేషన్ లో అంతరాయం వల్ల అక్కడి పూర్తిస్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు.

Also Read: Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ !

భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్‌ స్టేట్స్‌  జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది. కాగా ఇప్పటి వరకూ 1600 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆపరేషన్‌ బ్రహ్మ..

ఆ కష్టసమయంలో అక్కడి ప్రజలకు ఆపన్నహస్తం అందించేందుకు భారత్‌ ఇప్పటికే ముందుకొచ్చింది. ఆపరేషన్‌ బ్రహ్మ కింద దాదాపు 15టన్నుల సహాయ సామాగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతో పాటు ...తాత్కాలిక నివాసం కోసం టెంట్లు , స్లీపింగ్‌ బ్యాగ్స్‌,వాటర్‌ ప్యూరిఫయర్లు,సోలార్‌ ల్యాంప్‌, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌ కు పంపించినట్లు సమాచారం. 

అంతేకాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది.అమెరికా, ఇండోనేషియా, చైనా,ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియా-గుటేరస్‌ వెల్లడించారు. 

Also Read: Tamilanadu CM: తమిళనాడు తరువాత ముఖ్యమంత్రిగా ఆయనకే జైకొడుతున్న జనం!

Also Read:  Political Panchangam: రేవంత్, పవన్‌కు తిరుగులేదు.. మరి చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే!

massive earthquake in myanmar | earthquake | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు