Trump-musk-Zelensky: జెలెన్‌ స్కీ...ట్రంప్‌..మధ్యలో మస్క్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం వెనక ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ జెలెన్‌ స్కీతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు సమాచారం.

Trump-Musk:  నా కేబినెట్‌ లో మస్క్‌: ట్రంప్‌!
New Update

America:

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం వెనక  ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పాత్ర గణనీయమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రంప్‌ ప్రచారానికి భారీగా విరాళాలివ్వడమే కాక..బహిరంగ ర్యాలీల్లోనూ పాల్గొని ఓటర్లను ఉత్సాహపర్చారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ కార్యవర్గంలో మస్క్‌ కు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!

దాన్ని మరింత బలపర్చేలా మరో వార్త బయటికొచ్చింది. ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తో ట్రంప్‌ ఫోన్‌ లో మాట్లాడుతుండగా..ఆ కాల్‌ లో మస్క్‌ కూడా చేరినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఎలాన్‌ మస్క్‌ ఫ్లోరిడాలోని ట్రంప్‌ నివాసంలో ఆయనతో కలిసే ఉన్నారు. 

 ఆ సమయంలో ఎలాన్‌ మస్క్‌ ఫ్లోరిడాలోని ట్రంప్‌ నివాసంలో ఆయనతో కలిసే ఉన్నారు.ఆ సమయంలో ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌ ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.

Also Read: Brazil: విమానాశ్రయంలో కాల్పులు...ఒకరి మృతి!

వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా ట్రంప్‌ మధ్యలో ఫోన్‌ ను మస్క్‌ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్‌ స్కీతో మాట్లాడమని స్పేస్‌ఎక్స్‌ అధినేతను కోరినట్లు సమాచారం. దీంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి తో మస్క్ కొంతసేపు మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

వీరిద్దరూ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం గురించి చర్చించుకున్నారా? లేదా? అన్న దాని పై స్పష్టత లేదు. అయితే, ఉక్రెయిన్‌ లో స్టార్ లింక్‌ సేవలను కొనసాగిస్తానని మస్క్‌ చెప్పినట్లు సమాచారం. దాదాపు అరగంట పాటు ఈ ముగ్గురు చర్చించుకున్నారట. 

Also Read:  Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు హైదరాబాద్‌ వాసులు మృతి

ఉక్రెయిన్‌ కు అండగా ఉంటానని ట్రంప్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే తాజా కథనాల నేపథ్యంలో ట్రంప్‌ కార్యవర్గంలో మస్క్‌ ప్రభావవంతమైన పదవి చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

ఇటీవల ఫలితాల అనంతరం ట్రంప్‌ ప్రసంగిస్తూ యుద్ధాల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. నేను యుద్దాలను ప్రారంభించను. కానీ వాటిని ముగించేందుకు సాయం చేసత్ఆ అని అన్నా రు. అంతకుముంఉద కూడా రష్యా -ఉక్రెయిన్‌ సంఘర్షణల గురించి ఆయన పలుమార్లు స్పందించారు. తాను అధికారంలోకి వస్తే ఒక్క రోజులోనే ఉద్రిక్తతలను ముగిస్తానని చెప్పారు. 

Also Read:  Mallareddy: మల్లారెడ్డితో పాటు ఆ 12 మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్!

#trump #elanmusk #zelenskyy #ukraine-zelenskyy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe