పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంధ్య థియేటర్ యాజమాన్యం చెప్పిన ఓ చిన్న విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రేవతి మృతికి కారణం అల్లు అర్జున్ అన్న చర్చ జరుగుతోంది. ఈనెల 5వ తేదీన పుష్ప-2 ప్రీమియర్ షోకు టికెట్లు కొనుక్కొని వెళ్లిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో మృతిచెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. Also Read: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్ ఈ ఘటనపై రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం, సినీహీరో అల్లు అర్జున్ సహా పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని బుధవారం నాడు సంధ్య థియేటర్ యజమానులు కోర్టును ఆశ్రయించారు. పుష్ప- 2 ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృతికి, తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమానులు తెలిపారు. అందువల్ల తమపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ యజమానురాలు రేణుకాదేవి, ఇతరులతో పాటు సంధ్య సినీ ఎంటర్‌ప్రైజ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తొక్కిసలాట జరగడానికి తాము కారణం కాదని.. థియేటర్ తమదే అయినప్పటికీ.. ప్రీమియర్ షో నిర్వహణకు, బన్నీ రాకకు తమకు సంబంధం లేదని తేల్చేసింది. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లు నిర్వహించారని, ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో సైతం జారీ చేసిందని తెలిపారు. థియేటర్ మైత్రీ డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ తమ బాధ్యతగా తాము బందోబస్తు కల్పించాలని, జనాలను అదుపు చేయాలని పోలీసులకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. కొంతమంది పోలీసులు బందోబస్తుకు వచ్చినప్పటికీ విపరీతమైన తోపులాట వల్ల ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. Also Read: మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్! ఈ ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేశారంటూ వంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. సినీ హీరో సెక్యూరిటీ సిబ్బంది వల్ల ఘటన జరిగినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారే తప్ప తమపై ఎలాంటి ఆరోపణ లేదని తెలిపారు. అందువల్ల కేసు కొట్టేయాలని కోరారు.