Medigadda Barrage : మేడిగడ్డను కూల్చాల్సిందే ..ఎన్డీఎస్‌ఏ సంచలన రిపోర్ట్!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు భవితవ్యంపై ఎన్డీఎస్‌ఏ తన నివేదికలో సంచలన సిఫారసులు చేసింది.  మేడిగడ్డ బ్యారేజ్‌ ఏడో బ్లాక్‌ కూల్చాల్సిందేనంటూ నివేదికలో పేర్కొంది

New Update
ndsa report

కాళేశ్వరం ప్రాజెక్టుపై  నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ  కేంద్ర జలశక్తి శాఖకు తుది నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు భవితవ్యంపై ఎన్డీఎస్‌ఏ తన నివేదికలో సంచలన సిఫారసులు చేసింది.  మేడిగడ్డ బ్యారేజ్‌ ఏడో బ్లాక్‌ కూల్చాల్సిందేనంటూ నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా రిపేర్లు చేసినా ఫలితం ఉంటుందన్న గ్యారెంటీ లేదంటూ రిపోర్టులో పొందుపరిచింది. మళ్లీ భారీ వరద వస్తే బ్యారేజ్‌ తట్టుకోవడంపై ఎన్డీఎస్‌ఏ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు  కొత్తగా మళ్లీ నిర్మించాలంటూ తన తుది నివేదికలో ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ  తెలిపింది.

ఏడో బ్లాక్ ​కింద భారీ గుంత

ఏడో బ్లాక్ ​కింద భారీ గుంత ఉందని...దాన్ని ఇప్పటికే గ్రౌటింగ్ తో పూడ్చారన్నారని వెల్లడించింది. బ్యారేజీ కట్టిన ప్రాంతంలో నది వెడల్పు ఒక్కసారిగా కుచించుకుపోయినట్టు ఉంటుందని,  ఫలితంగా భారీ వరద వస్తే తన్నుకొచ్చే ప్రమాదం ఎక్కువని పేర్కొంది. బ్యారేజీ కట్టినప్పటి నుంచి ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్​నూ కూడా పట్టించుకోలేదని.. ఎప్పటికప్పుడు మానిటర్ ​చేయాల్సి ఉన్నా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ నివేదిరను మరో రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది.  కాగా ఈ రిపోర్టు కోసమే కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్ ​కూడా ఎదురు చూస్తున్నది. ఆ రిపోర్టు ప్రకారం కమిషన్ ​చర్యలను సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.  

కేసీఆర్,  హరీశ్‌ లకు ఊరట

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనకు సంబంధించి నిర్మాణాల్లో అక్రమాలే కారణమని పేర్కొంటూ..అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి హరీశ్‌ రావులపై భూపాలపల్లి కోర్టులో స్థానిక న్యాయవాది  ఒకరు పిటిషన్ వేశారు. అయితే ఈ నోటీసులను క్వాష్‌ చేయాల్సిందిగా కేసీఆర్‌, హరీశ్‌ రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ..  భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా పిటిషినర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. 

Also Read :  ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు