Microsoft: మైక్రోసాఫ్ట్‌లో ఆందోళనలు.. 18 మంది అరెస్టు

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఖండిస్తూ అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌లో కొందరు ఉద్యోగులు ఆందోళనలు చేశారు. తమ కంపెనీ రూపొందించిన టెక్నాలజీని వినియోగించి ఇజ్రాయెల్ సైన్యం దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.

New Update
Microsoft

Microsoft

హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఖండిస్తూ అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌లో కొందరు ఉద్యోగులు ఆందోళనలు చేశారు. తమ కంపెనీ రూపొందించిన టెక్నాలజీని వినియోగించి ఇజ్రాయెల్ సైన్యం దారుణాలకు పాల్పడుతోందని ఆరోపణలు చేస్తున్నారు. వాషింగ్టన్ రెడ్‌మండ్‌లోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రాంగణంలో 35 మంది గత రెండురోజులుగా నిరసనలు చేస్తున్నారు. చివరికీ కంపెనీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 18 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మైక్రోసాఫ్ట్‌ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. 

Also Read: రష్యా..భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి.. జైశంకర్ స్ట్రాంగ్ మెసేజ్

ఇక వివరాల్లోకి వెళ్తే.. మైక్రోసాఫ్ట్‌కు తయారుచేసిన ఓ సాఫ్ట్‌వేర్ సాయంతో గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీయుల ఫోన్‌ కాల్‌ డేటాను ఇజ్రాయెల్ భద్రతా దళం స్టోర్ చేస్తోందని ఇటీవ బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ కథానాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన మైక్రోసాఫ్ట్‌.. ఎమర్జెన్సీ సమీక్ష చేపడుతున్నట్లు పేర్కొంది. దీనికోసం ఓ కన్సల్టింగ్ సంస్థను కూడా నియమించుకున్నట్లు చెప్పింది. దీనివల్ల అక్కడ మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. 

Also read: ఎక్కడైనా ఫ్రెండే కానీ ఆంక్షల దగ్గర కాదు..రష్యా విమానాలకు ఇంధనం ఇవ్వని అమెరికా

ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ ముందు రెండ్రోజులుగా ఓ బృందం నిరసనలు చేపడుతోంది. కంపెనీ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ వాళ్లు వెళ్లలేదు. రంగులు చల్లుతూ ఆందోళనలు మరింత ఉద్ధృతం చేశారు. ఫర్నిచర్‌ను చిందరవందర చేసేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకున్నారు.  అయితే ఇజ్రాయెల్‌కు సంబంధించి ఆ సంస్థ ఉద్యోగులు నిరసనలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో సీఈవో సత్య నాదెళ్ల ప్రసంగాన్ని అడ్డుకున్న ఉద్యోగిపై వేటు పడింది. అలాగే ఏప్రిల్‌లో సంస్థ వార్షిక కార్యక్రమంలో కూడా అంతరాయం కలిగించినందుకు ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ఇక ఇజ్రాయెల్ సైన్యం మైక్రోసాఫ్ట్ ఏఐ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నట్లు నివేదికలు వచ్చాయి. సైన్యానికి ఈ సాంకేతికత అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ చెప్పలేదు. అలాగే గాజాకు హానీ కలిగించేలా తమ సాంకేతికత లేదని క్లారిటీ ఇచ్చింది.  

Also Read: రష్యా..భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి.. జైశంకర్ స్ట్రాంగ్ మెసేజ్

Advertisment
తాజా కథనాలు