New Jersey:ఫుల్లుగా తాగి కారు డ్రైవ్ చేసిన మేయర్..

అమెరికాలోని న్యూజెర్సీ మేయర్ గినా లాప్లాసా తన రెండేళ్ల కుమారుడిని డే కేర్ నుంచి తీసుకు వచ్చేందుకు కారులో వెళ్లారు. అయితే వెళ్లేటప్పుడే ఆమె ఫుల్లుగా మద్యం సేవించారు. చిన్నారిని తీసుకుని వస్తుండగా.. కూడా మద్యం మత్తులోనే కారు నడిపారు.

New Update
gina

gina

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ మేయర్.. బాధ్యత రహితంగా వ్యవహరించారు. ముఖ్యంగా తన రెండేళ్ల వయసు ఉన్న బిడ్డను డే కేర్ నుంచి తీసుకు వచ్చేందుకు వెళ్లిన ఈమె కారులోనే ఫుల్లుగా మద్యం సేవించారు. చిన్నారిని తీసుకు వస్తుండగా కూడా అదే పనిగా తాగుతూ.. మద్యం మత్తులోనే కారును నడిపారు. విషయం గుర్తించిన ఇతర వాహన దారులు దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయింది. అయితే ఈ వీడియోను చూసిన పోలీసు అధికారులు ఆమె పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. 

Also Read: Samsung Tv Offers: హాట్ హాట్ శాంసంగ్ సేల్.. టీవీలపై భారీ డిస్కౌంట్- సగం ధరకే సౌండ్ బార్‌!

మద్యం మత్తులో మేయర్...

అమెరికాలోని న్యూజెర్సీ మేయర్ గినా లాప్లాసా తన రెండేళ్ల కుమారుడిని డే కేర్ నుంచి తీసుకు వచ్చేందుకు కారులో వెళ్లారు. అయితే వెళ్లేటప్పుడే ఆమె ఫుల్లుగా తాగారు. చిన్నారిని తీసుకుని వస్తుండగా.. కూడా మద్యం మత్తులోనే కారు నడిపారు. అయితే డ్రైవింగ్ చేస్తుండగా.. మద్యం మత్తులో మేయర్ ఓ వాహనానికి డ్యాష్‌ ఇవ్వబోయారు. అయితే అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి  బయట పడ్డారు. ఇంత నిర్లక్ష్యంగా కారు నడపగా.. అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియోగా తీశారు. ముఖ్యంగా అప్పుడు మేయర్ పక్కన రెండేళ్ల చిన్నారి కూడా ఉండగా.. క్షణాల్లోనే వీడియో వైరల్‌గా మారింది.

Also Read: Pareshan Boys Imran: అంతా అన్వేషే చేశాడు.. బోరున ఏడ్చేసిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!

ఇలా ఈ వీడియో కాస్తా పోలీసుల కంట పడగా.. వెంటనే మేయర్ వెళ్తున్న కారును ఫాలో అయ్యారు. అలా ఆమె ఇంటికి చేరుకోగానే.. వెళ్లి తనిఖీ చేశారు. అయితే కారులో మద్యం సీసా దొరకగా.. ఆమెకు ఆల్కహాల్ టెస్ట్‌ చేయడంతో..ఆమె పాజిటివ్ వచ్చింది.దీంతో  వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో సదరు మేయర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆమెకు పిల్లాడిని దూరంగా ఉంచమంటూ అనేక మంది కామెంట్లు పెడుతున్నారు.

అయితే దీనిపై ఆమె భర్త స్పందించారు. లక్షలాది మంది అమెరికన్లు మద్యం వ్యసనంతో పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. వారికి ఎలాంటి సాయం అందడం లేదని చెప్పారు. ఈ వ్యసనాన్ని వదిలించుకోవడానికి మేయర్ గినా చాలా కష్ట పడుతుందని... ఇప్పుడు ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని వివరించారు. దయచేసి విమర్శలు ఆపండి అని చెబుతూనే ఆమె ఇతరులకు సాయం చేయాలనే అభిరుచిని గుర్తించాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Also Read: AP Govt: సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ .. రేపు ఖాతాలోకి రూ.6,200 కోట్లు

Also Read: Kanchana 4: లారెన్స్ మామూలోడు కాదుగా.. ఈ సారి ఏ దెయ్యానికి బాడీ అద్దెకు ఇస్తున్నాడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు