Bangladesh: హిందువులకు ప్రత్యేక పోలింగ్ బూత్‌లు కావాలి.. హిందూ సంఘాల డిమాండ్

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి హిందూ సంఘం ఎన్నికల కమిషన్‌తో సమావేశమయ్యింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ హిందూ ఓటర్లకు ఈసీ అదనపు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేసింది.

New Update
Hindus Unsafe In Bangladesh, Demands Separate Voting Booths

Hindus Unsafe In Bangladesh, Demands Separate Voting Booths

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో హిందువులపై దాడులు పెరగడం దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే అక్కడి హిందూ సంఘం ఎన్నికల కమిషన్‌తో సమావేశమయ్యింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ హిందూ ఓటర్లకు ఈసీ అదనపు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేసింది.

Also Read: టార్గెట్ ఇరాన్...భారత్ పై భారీ ఎఫెక్ట్..75 శాతం తప్పవేమో

 ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల తమకు రక్షణ లేదని వాపోయింది. మైనార్టీలపై దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఎన్నికల్లో సురక్షితంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలంటూ కోరింది. 

Also Read: ప్రతి కుక్క కాటుకు భారీ జరిమానా.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఇదిలాఉండగా ఇటీవల బంగ్లాదేశ్‌ విద్యార్థి నేత ఉస్మాన్‌ హదీని దుండగులు కాల్చి చంపడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత బంగ్లాదేశ్‌లో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. మరోవైపు హిందువులపై దాడులు కూడా జరిగాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఇదిలాఉండగా ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.  

Advertisment
తాజా కథనాలు