Meta: భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన మెటా..

2024 ఎన్నికలకు సంబంధించి ఇటీవల మార్క్ జూకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటా సంస్థ స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. మెటా కంపెనీకి భారత్‌ ఎంతో ప్రాముఖ్యమైనదని పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Mark Zuckerberg and Meta

Mark Zuckerberg and Meta

Meta: 2024లో జరిగిన ఎన్నికల్లో భారత్‌తో సహా చాలా దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయని ఇటీవల మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్‌ వేదికగా స్పందించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. జూకర్‌ బర్గ్(Mark Zuckerberg) చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా జూకర్‌బర్గ్‌కు సమన్లు జారీ చేసిందుకు సిద్ధమైంది. అయితే తాజాగా మెటా సంస్థ దీనిపై స్పందించింది. జూకర్‌బర్గ్ చేసిన పొరపాటుకు భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది.  

Also Read:కొత్త టెలికాం రూల్.. సిమ్ కార్డ్ తీసుకునేవారికి వారికి ఇది పక్కా

ఇక వివరాల్లోకి వెళ్తే.. జనవరి 10న జూకర్‌బర్గ్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నికల అంశం గురించి మాట్లాడారు. భారత్‌తో సహా అనే దేశాల్లో ఎన్నికలు జరగగా.. అన్నిచోట్ల అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయని అన్నారు. కరోనా వల్ల తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు లేదా ద్రవ్యోల్బణం వల్లే ఈ ప్రభావం కనిపించిందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీంతో జూకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీనిపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై విశ్వాసంతో మూడోసారి గెలిపించారని.. జూకర్‌బర్గ్‌ తప్పుగా చెప్పారని కౌంటర్ వేశారు. 

Also Read: టిబెట్‌లో ఆగని భూ ప్రకంపనలు..168 గంటల్లో 3600 సార్లు..

క్షమాపణలు చెప్పిన మెటా(META)...

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కూడా మెటా సంస్థకు సమన్లు జారీ చేసిందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెటా సంస్థ పబ్లిక్ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్ శివంత్ తుక్రాల్ స్పందించారు. జూకర్‌బర్గ్‌ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. '' 2024 ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు విజయం సాధించలేవనే మార్క్‌ చేసిన వ్యాఖ్యలు అనేక దేశాలకు వర్తిస్తుంది. కానీ భారత్‌కు మాత్రం ఇందులో మినహాయిపు ఉంది. ఇలా అనుకోకుండా జరిగిన పొరపాటుకు మేము క్షమాపణలు కోరుతున్నాం. మెటా కంపెనీకి భారత్ ఎంతో ప్రాముఖ్యమైనదని'' శివంత్ తుక్రాల్ తెలిపారు.  

Read Also :కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

Advertisment
తాజా కథనాలు