ట్రంప్ టారిఫ్‌ల తగ్గింపు.. 15 నిమిషాల్లోనే రూ. 13 లక్షల కోట్ల లాభం

భారత్‌పై విధించిన సుంకాలను ట్రంప్ 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది దేశీయంగా మదుపర్లలో సానుకూల ఎఫెక్ట్‌ చూపించింది. దీంతో భారత స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

New Update
Markets likely to stage smart rally

Markets likely to stage smart rally

అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంపై ట్రంప్‌ చేసిన ప్రకటనతో భారత స్టాక్‌ మార్కెట్లు వేగం పుంజుకున్నాయి. రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేస్తున్నాయి. భారత్‌పై విధించిన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది దేశీయంగా మదుపర్లలో సానుకూల ఎఫెక్ట్‌ చూపించింది. దీంతో భారత స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా ఒక శాతానికి పైగా పెరిగి రూ.90.30 స్థాయికి వెళ్తుంది. ప్రస్తుతానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్‌ 2300 పాయింట్లకు పైగా చేరింది. 84 వేల పాయింట్ల స్థాయిలో ట్రేడవుతోంది. 

నేషనల్ స్టాక్‌ ఎక్స్చేంజి సూచి నిఫ్టీని చూస్తే 700 పాయింట్లు పుంజుకుని 25,780 స్థాయిలో వెళ్తోంది. ఇటీవల చూసుకుంటే స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇంతటి స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. ప్రారంభంలో చూసుకుంటే ఎక్కువ లాభాల్లోనే ట్రేడయ్యాయి. ఇక ప్రీ ఓపెన్ సెషన్‌లో చూస్తే సెన్సెక్స్‌ ఒక దశలో 4 వేల పాయింట్లకు పైగా లేదా 5 శాతం దాకా పెరుగుతుంది. నిఫ్టీ రికార్డు స్థాయిలో చూస్తే 1400 పాయింట్ల వరకు లాభాల్లో ప్రారంభమవుతుంది. అయితే ఈ దశలో కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే BSE లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.13 లక్షల కోట్లు పెరిగింది. తర్వాత అమ్మకాల ఒత్తిడి రావడంతో సూచీలు వెనక్కి తగ్గిపోయాయి. 

Also Read: మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. తాగిపడిపోతే ఆ సేవలు

కొన్ని హెవీ వెయిట్‌ స్టాక్స్‌ అన్నికూడా దూసుకుపోతున్నాయి. ఇటీవల రెండు దేశాల మధ్య అనిశ్చితి కొనసాగింది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు భారీగా తమ ఇన్‌వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకున్నారు. చివరికి స్టా్క్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇప్పుడు చూసుకుంటే ట్రేడ్‌ డీల్‌ కూడా లాక్‌ అయిపోయింది. మరికొన్ని రోజుల్లో నష్టాల నుంచి గట్టెంకించే దిశగా కొనుగోళ్లు జరగడంతో కొన్ని హెవీ వెయిట్‌ స్టాక్స్‌ అన్నీ కూడా మంచి లాభాలను నమోదు చేస్తున్నాయి.   

Also Read: ఈయూ ప్రతినిధి సంచలన ప్రకటన.. యూరప్ సైన్యం ఏర్పాటు ప్రమాదకరమని హెచ్చరిక

ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చూసుకుంటే ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ.1450 స్థాయిలో ఉంది. ఇంట్రాడేలో చూసుకుంటే 5 శాతానికి పైగా వృద్ధి చెంది రూ.1489.50 వద్ద గరిష్ఠాన్ని రికార్డు చేసింది. ఎం అండ్ ఎం షేరు కూడా 4 శాతానికి ఎగబాకింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ షేరు ఓ దశలో 20 శాతం పెరిగి.. మళ్లీ కాస్త వెనక్కి తగ్గింది. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, HDFC, ICICI బ్యాంకుల షేర్లు కూడా 3 శాతం దాకా పెరిగాయి. TCS, HCL టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్‌ మహీంద్రా లాంటివి 2 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడే గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్‌, అవంతీ ఫీడ్స్‌, ఇతర టెక్స్‌టైల్స్‌ స్టాక్స్‌ కూడా 20 శాతం దాకా పెరిగాయి.  

Advertisment
తాజా కథనాలు