USA: 55 మిలియన్ వీసాల తనిఖీ..ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్

అమెరికాలో అతి పెద్ద ప్రక్షాళనకు తెర తీస్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. యూఎస్ లో ఉన్న 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను తనిఖీ చేయనున్నారు. చరిత్రలోనే ఇది అతి పెద్ద దేశీయ బహిష్కఱ అని చెబుతున్నారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అక్రమవలదారులపై ఉక్కు పాదం మోపుతూనే ఉన్నారు. దాదాపు 6 వేల మంది వీసాలను రద్దు చేశారు. దాంతో పాటూ సొంత విమానాలను ఏర్పాటు చేసి మరీ చాలా మందిని  దేశం నుంచి పంపించేశారు. దాని తరువాత కూడా అక్రమవలదారుల తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య లాస్ ఏంజెలెస్ లో చెప్పా పెట్టకుండా తనిఖీలు నిర్వహించింది హోమ్ ల్యాండ్ ఆఫ్ అమెరికా. దీంతో పెద్ద గొడవే చెలరేగింది. దాదాపు పదిహేను రోజుల పాటూ అక్కడ నిరసనలు, ఆందోళనలు జరిగాయి. అది మిగతా ప్రాంతాలకు పాకింది. చాలా చోట్ల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. 

అతి పెద్ద దేశీయ బహిష్కరణ ఆపరేషన్..

ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈ సారి ఏకంగా 55 మిలియన్లు అంటే 55 కోట్ల మంది వీసాలను తనిఖీ చేయనుంది హోమ్ ల్యాండ్ ఆఫ్ అమెరికా. ఇందులో ఎవరైనా వీసా రూల్స్ ను అతిక్రమించారా లేదా అన్నది పరిశీలించనున్నారు. నేరాలు. ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డం, ఉగ్ర సంస్థలకు మద్దతునివ్వడం, కాల పరిమితి అయిపోయినా దేశంలోనే ఉండడం లాంటివి ఎవరు చేసినా వెంటనే వారి వీసాలను క్యాన్సిల్ చేయనున్నారు. అంతేకాదు వారిని వెంటనే వాళ్ళ దేశాలకు పంపించేయనున్నారు కూడా. ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద ప్రక్షాళన లేదా పరిశీలన అని చెబుతున్నారు. 

ఇప్పటికే 6వేల స్టూడెంట్స్ వీసాలు రద్దు...

జనవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, 6,000 కంటే ఎక్కువ విద్యార్థి వీసాలు రద్దు చేశారు. ఓవర్ స్టే, దాడులు, తాగి డ్రైవింగ్ చేయడం, ఉగ్రవాదుల సంబంధాల కారణంతో చాలా మంది విద్యార్థులను ఇంటికి పంపేశారు. ఈ చర్యలను తీసుకోవడానికి తమకు హక్కు ఉందని..అమెరికా విదేశాంగ విధానానికి హానికరంగా పరిగణించబడే చర్యలకు వీసా రద్దును అనుమతించే 1952 చట్టమదేనని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చెబుతున్నారు. పాలస్తీనా అనుకూల నిరసనలు ఆ వర్గంలోకి వస్తాయని ఆయన చెబుతున్నారు. 

ప్రస్తుతం చేపట్టనున్న వీసాల పరిశీలన విస్తృతంగా చేస్తామని చెబుతోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సోషల్ మీడియా తనిఖీలు, లేతైన డేటా షేరింగ్ లాంటివి కూడా చెక్ చేస్తామని తెలిపారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్‌తో వివాదాస్పద ఒప్పందం, ఇమ్మిగ్రేషన్ అధికారులకు మిలియన్ల వలసదారుల పన్ను రికార్డులను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని...దీని ద్వారా తనిఖీలు చేస్తామని చెప్పారు. అమెరికా చరిత్రలో ఇది అతి పెద్ద దేశీయ బహిష్కరణ ఆపరేషన్ అని అధికారులు చెబుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 13, 900 మంది అమెరికన్ పౌరులు కాని వారిని మహిష్కరించామని...మరో 15 వేల మందిని అరెస్ట్ చేశామని చెబుతున్నారు. దీంతో పాటూ ఇప్పుడు దాదాపు పది లక్షల మందికి తాత్కాలిక రక్షణలను ముగించాలని కూడా అనుకుంటున్నామని అధికారులు తెలిపారు. 

Also Read: Trump Out: ఇదేం కుదిరే బేరంలా లేదు..రష్యా, ఉక్రెయిన్ శాంతి ఒప్పంద నుంచి ట్రంప్ ఔట్?

Advertisment
తాజా కథనాలు