/rtv/media/media_files/2025/09/07/lunar-eclipse-2025-09-07-15-29-34.jpg)
Lunar Eclipse
Lunar Eclipse: సెప్టెంబర్ 7న అంటే (నేడు) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారుతాడు. దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది. చంద్రగ్రహణం సూతకం మధ్యాహ్నం 12.57గంటలకు ప్రారంభం కానుంది. ఈ సూతకాలం చంద్రగ్రహణం ముగిసే వరకు ఉంటుంది.జ్యోతిషశాస్త్ర ప్రకారం.. చంద్రగ్రహణం సూతక కాలం ఎల్లప్పుడూ 9 గంటల ముందే మొదలవుతుంది. ఈ అరుదైన ఖగోళ సంఘటనను ప్రపంచ జనాభాలో సుమారు 85 శాతం మంది.. అంటే దాదాపు 700 కోట్లమంది వీక్షించగల అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ గ్రహణం మొత్తం 3 గంటల 29 నిమిషాల 24 సెకన్ల పాటు కొనసాగుతుందని తెలుస్తోంది.ఇందులో సంపూర్ణ చంద్రగ్రహణం 82 నిమిషాల పాటు కొనసాగనుంది. గ్రహణం ప్రారంభ దశలో చంద్రుడు భూమి ఆవర్తనంలోకి ప్రవేశించగానే చీకటి కమ్ముకుంటుంది. ఇది పాక్షిక గ్రహణాన్ని సూచిస్తుంది. అనంతరం రేలీ స్కాటరింగ్ ప్రభావంతో చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోతాడు. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే రేఖలోకి వచ్చినపుడు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి ప్రవేశిస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.అదే కొంత భాగం మాత్రమే నీడలోకి వస్తే దాన్ని పాక్షిక చంద్రగ్రహణంగా పిలుస్తారు.
అయితే ఈరోజు ఏర్పడే గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో చంద్రుడు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాడని తెలుస్తోంది. అనంతరం మళ్లీ తన సహజ ప్రకాశాన్ని తిరిగి పొందుతాడు.భూమి, చంద్రుడు, సూర్యుని కదలికల ఆధారంగా ప్రాంతాలను బట్టి గ్రహణం కనిపించే విధానం మారనుంది.ఈ గ్రహణం ఆసియా, తూర్పు ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో పూర్తిగా కనిపించనుంది.యూరప్, బ్రెజిల్ తూర్పు తీరాల్లోని ప్రజలకు ఇది పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది.మొత్తం మీద సుమారు 7 బిలియన్ల మంది ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 7న ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది. హైదరాబాద్ లోనూ చాలా స్పష్టంగా కనపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రగ్రహణ సమయంలో ... చంద్రుడు పూర్తిగా భూమి నీడలోఉంటాడు. అయితే వాతావరణం అనుకూలిస్తే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో హైదరాబారాబాద్ సహా 15 నగరాల్లో క్లారిటీగా చూడొచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వాటిలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి ,ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, లక్నో, ముంబై, అహ్మదాబాద్, పూణే, కోల్‌కతా, భువనేశ్వర్, గౌహతి,భోపాల్, నాగ్‌పూర్, రాయ్‌పూర్ ఉన్నాయి.
ఎవరిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే?
సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు గ్రహణం రోజు సాయంత్రం ఆరు గంటల లోపే భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఆరు గంటల తర్వాత నుంచి గ్రహణ సమయం కొనసాగేవరకూ ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది.
ఈ గ్రహణం మూలంగా కుంభ, మీనం, మిథునం, సింహ రాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా కుంభ, సింహ రాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది.గ్రహణం సమయంలో దుర్గా దేవిని పూజించడం, రాహు జపం చేయడం మంచిది. వెండి నాగపడగ, శేరుంబావు బియ్యం, నవ ధాన్యాలు దానం చేయడం.. పట్టు విడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభఫలితాలు ఇస్తాయి. కొన్ని రాశుల వారికి (కుంభం, మీనం, మేషం, మిథునం, సింహం) ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలుండే అవకాశం ఉంది.