IND PAK WAR : యుద్ధం మధ్యలో కల్పించుకోము..అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కీలక ప్రకటన

ఇండియా, పాకిస్థాన్‌ల యుద్ధంలో జోక్యం చేసుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా నిరాకరించింది. యుద్ధం ఆరంభమైన తర్వాత తాము చేసేదేం లేదని అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీవాన్స్‌ తేల్సి చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చేయాల్సిందంతా చేశామన్నారు.

New Update

 IND PAK WAR :  ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో జోక్యం చేసుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా నిరాకరించింది. యుద్ధం ఆరంభమైన తర్వాత తాము చేసేదేం లేదని తేల్చి చెప్పింది. యుద్ధం మొదలు కాకుండా ఉండాలనే భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికే చేయాల్సిందంతా చేశామని పేర్కొంది. ఈ విషయమై అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీవాన్స్‌ మాట్లాడుతూ యుద్ధం మధ్యలో తాము కల్పించుకోబోమని స్పష్టం చేశారు.  రెండు దేశాలు సంయమనం పాటించి వీలయినంత దొందరగా పరిస్థితులు చక్కబడేలా చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాలను యుద్ధం ఆపాలని చెప్పే స్థితిలో అమెరికా లేదని అన్నారు. యుద్ధం ఆపడానికి ప్రయత్నం మాత్రమే చేయగలమని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం మధ్యలో కలుగజేసుకుని ఆపమని చెప్పడం తమ పని కాదన్నారు. 

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

ఆయన మాట్లాడుతూ.. ‘ ఇండియన్స్‌ను యుద్ధం ఆపమని అమెరికా చెప్పలేదు. అలాగని పాకిస్తానీలను యుద్ధం ఆపమని కూడా చెప్పలేదు. అదే సమయంలో ఈ యుద్ధం మరింత పెద్ద యుద్ధంగా మారి.. న్యూక్లియర్ వార్‌గా మారకూడదని మాత్రం కోరుకుంటున్నానన్నారు. ఇప్పటికైతే అలాంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోవడం లేదు అని అన్నారు. ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న సైనిక చర్యలతో అమెరికాకు ఏ సంబంధం లేదని జేడీ వాన్స్ తేల్చి చెప్పారు. ఇది నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నారు. భారతదేశం-పాకిస్తాన్ వివాదం ‘ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు. భారత్, పాక్‌లు అమెరికా నియంత్రణలో లేవని తేల్చి చెప్పారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

ఒహియో మాజీ సెనేటర్ అయిన జేడీ వాన్స్ మాట్లాడుతూ ఈ వివాదం ‘సాధ్యమైనంత త్వరగా తగ్గాలని’ మాత్రమే అమెరికా కోరుకుంటుందని అన్నారు. అయితే ఆ రెండు దేశాలను మేము నియంత్రించలేమన్నారు. భారతదేశానికి పాకిస్తాన్‌తో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయన్నారు. పాకిస్తాన్ తనపై భారతదేశ దాడులకు ప్రతిస్పందించింది. మనం చేయగలిగేది ఏమిటంటే, ఈ ఘర్షణను కొంచెం తగ్గించమని కోరడం మాత్రమే చేయగలమని, కానీ ప్రాథమికంగా మాకు సంబంధం లేని, అమెరికా నియంత్రణతో సంబంధం లేని యుద్ధంలో మేం పాల్గొనబోము” అని వాన్స్ తేల్చి చెప్పారు.

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు