America : అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు వీలైనన్నిఇబ్బందులు సృష్టించే పనిలో పడ్డారు బైడెన్. తాజాగా ట్రంప్ లక్ష్యమైన గ్యాస్,చమురు డ్రిల్లింగ్ పనులు ముందుకు వెళ్లకుండా ఆయన ఏకంగా 75 ఏళ్ల నాటి ఓ చట్టాన్ని తెరపైకితీసుకొచ్చారు. అమెరికా సముద్ర జలాల్లో దాదాపు 62కోట్ల ఎకరాల ప్రదేశాన్ని ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్ నుంచి కాపాడేందుకు దీన్ని వాడనున్నారు. ఈ విషయాన్ని సోమవారం శ్వేతసౌధం ప్రకటించింది. Also Read: CM Revanth: సీఎం పేరు మర్చిపోవడం కుట్ర.. వాడేం యాంకర్: ఎంపీ చామల సీరియస్ రియాక్షన్ శిలాజ ఇంధన ఉత్పత్తిని పెంచాలన్న ట్రంప్ (Trump) ప్లాన్ అమలును ఇది మరింత కఠినం చేయనుంది. 1953 ఔటర్ కాంటినెంటల్ షెల్ఫ్ ల్యాండ్ యాక్ట్ ఇందుకోసం బైడెన్ వాడుతున్నారు. దీని ప్రకారం చమురు, గ్యాస్ డ్రిల్లింగ్ నుంచి ఔటర్ కాంటినెంటల్ షెల్ఫ్ ను పూర్తిగా మినహాయించే అధికారం అధ్యక్షుడికి లభిస్తుంది. ,తూర్పు గల్ఫ్ మెక్సికో,అలాస్కాలోని ఉత్తర బేరింగ్, తూర్పు, పశ్చిమతీరాలు సముద్రం వంటివి వీటి కిందకు వస్తాయి. Also Read: Movies:ధనుష్ తర్వాత చంద్రముఖి మేకర్స్..నయనతారకు మరోసారి లీగల్ నోటీసులు మళ్లీ కాంగ్రెస్ ఆమోదం.. అంతేకాదు..అసలు ఈ చట్టం తర్వాత వచ్చే అధ్యక్షుడికి దానిని అడ్డుకొనే శక్తి ఉండదు. దీనిని ఆపాలంటే ట్రంప్ మళ్లీ కాంగ్రెస్ ఆమోదం పొందాల్సిందే. తాజాగా వారు అనుకొన్నచోట్ల డ్రిల్లింగ్ చేస్తే..కోలుకోలేనంత నష్టం వస్తుంది. వాస్తవానికి అమెరికా ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి అది అనవసరం.రిస్క్ చేయాల్సినంత విలువైందేమీ కాదు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలను వాతావరణ మార్పులు ప్రభావితతం చేస్తున్నాయి. మనం క్లీన్ ఎనర్జీ ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ తీరాలను మన పిల్లలు,మనవళ్ల కోసం సంరక్షించి తీరాల్సిందే.కాలిఫోర్నియా నుంచి ఫ్లోరిడా వరకు రిపబ్లికన్లు, డెమోక్రట్ గవర్నర్లు, కాంగ్రెస్ సభ్యులు , తీరప్రాంత ప్రజలు ఏకతాటి పైకి వచ్చి చమురు, సహజవాయు డ్రిల్లింగ్ నుంచి తీరాలను రక్షించడానికి ఏకతాటి పైకి రావాలి అని బైడెన్ (Joe Biden) పిలుపునిచ్చారు. దీని పై ట్రంప్ కార్యవర్గంలోని ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించనున్న కరోలైన్ లెవిట్టీ స్పందిస్తూ..దీనిని అమెరికా ప్రజల పై అవమానకర ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. చమురువెలికితీతలో బైడెన్ విఫలమయ్యారని అభివర్ణించారు. Aslo Read: Delhi Assembly Poll : నేడు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్.. ప్రకటించనున్న ఈసీ Also Read: Earthquake: చైనా, టిబెట్ భూకంపాలు...ఇప్పటివరకు 53 మంది మృతి