JD Vance: ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మద్దతివ్వండి..పాక్ కు జేడీ వాన్స్ సూచన

ఉగ్రవాదులను వేటాడ్డానికి భారత ప్రభుత్వం పాటుపడుతోంది. దానికి పాకిస్తాన్ సహకరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పిలుపునిచ్చారు. ప్రాంతీయ సంఘర్షణలకు దారి తీయకుండా ఉండాలని కోరారు. 

New Update
JD vance

JD vance

పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో ఆయన ఉండగానే ఉగ్రవాదులు కాశ్మీర్ లో దాడి చేసి టూరిస్టులను చంపేశారు. ఆ తరువాత జేడీ వాన్స్ అమెరికా కు తిరిగి వెళ్లిపోయారు. తాజాగా ఆయన ఈ మొత్తం వ్యవహారంపై స్పందించారు. ఉగ్రవాదాన్ని అణచడంలో భారత్ చేస్తున్న కృషిని గుర్తించాలని అమెరికా ఉపాధ్యక్షుడు అన్నారు. భారత్ కు మద్దతుగా పాకిస్తాన్ ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దాడి విషయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరు ప్రాంతీయ సంఘర్షణలకు దారి తీయకుండా ఉండాలని కోరారు. 

భారత్ లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ అత్యంత బాధాకరమని జేడీ వాన్స్ అన్నారు. దీనికి భారత స్పందిస్తున్న తీరు సరైనదే అని అన్నారు. పాకిస్తాన్ కూడా ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆశిస్తున్నామని అన్నారు. పాక్ భూభాగం నుంచే ఉగ్రవాదులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు కాబట్టి భారత్ కు ఆ దేశం సహకరించాలని జేడీ వాన్స్ అన్నారు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయలను పంచుకున్నారు. ఇక భారత చేసే ఈ పోరాటంలో అమెరికా ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన భరోసానిచ్చారు. 

ఎనిమిదో రోజూ కవ్వింపు చర్యలు..

పహల్గాం దాడి జరిగిన తర్వాత నుంచి పాక్ సైన్యం బోర్డర్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కుప్వారా, బారాముల్లా, పూంఛ్‌, నౌషెరా, అఖ్నూర్‌ సెక్టార్లలో దాయాది బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. 

today-latest-news-in-telugu | usa | jd-vance | india | pakistan

Also Read: Delhi: ఢిల్లీలో భారీ వర్షం...దుమ్ము తుఫాన్

Advertisment
తాజా కథనాలు