ఇదేం వింత రూల్‌ రా అయ్యా.. ఆ జాబ్‌లో చేరాలంటే రక్తంతో సంతకం చేయాల్సిందే

జపాన్‌లోని ఓ బ్యాంకు పెట్టిన రూల్ మాత్రం అందరినీ భయపెడుతోంది. అదేంటంటే ఉద్యోగంలో చేరేవారు తమ రక్తంతో సంతకం చేయాలి. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. దీనిగురించి పూర్తిగా తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

New Update
jobsss

ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే మనకు సంబంధించిన సర్టిఫికేట్ల జిరాక్స్‌లు ఇస్తాం. వాళ్లు చెప్పిన చోట సంతకాలు పెడతాం. ఇలా ఒక్కో కంపెనీకి ఒక్కో రూల్స్ ఉంటాయి. అయితే జపాన్‌లోని ఓ బ్యాంకు పెట్టిన రూల్ మాత్రం అందరినీ భయపెడుతోంది. అదేంటంటే ఉద్యోగంలో చేరేవారు తమ రక్తంతో సంతకం చేయాలి. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. దీనిగురించి పూర్తిగా తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ?

Japanese Bank

ఇక వివరాల్లోకి వెళ్తే.. జపాన్‌లోని షికోకు అనే బ్యాంకు ఉంది. ఈ బ్యాంకులో కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి అసాధరణ రూల్స్‌ అమలుచేశారు. ఉద్యోగంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడితే తమ ప్రాణాలు తీసుకుంటామని అధికారిక డాక్యుమెంట్‌పై రక్తంతో సంతకం చేయాలి. ఉద్యోగులు బ్యాంకు నుంచి డబ్బు దొంగిలించినా లేదా దొంగతనానికి ఇతరులకు సహకరించినా ఆ మొత్తాన్ని చెల్లించి సూసైడ్ చేసుకోవాలి అనేదే ఈ నిబంధన. 

Also Read: అదానీకి మరో షాక్..పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్

చాలాఏళ్ల క్రితం 39వ జాతీయ బ్యాంకు అనే పేరుతో దీన్ని స్థాపించారని.. అపట్లో ప్రెసిడెంట్ మియురాతో సహా అందులో చేరిన మొత్తం 23 మంది ఉద్యోగులు కూడా ఇలాగే రక్తంతో సంతకం చేశారని అధికారులు తెలిపారు. ఈ రూల్ పెట్టడం వల్ల తమ ఉద్యోగుల్లో నైతిక ప్రవర్తన, సామాజిక బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. వాళ్లు ఉద్యోగులుగా మాత్రమే కాకుండా సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉండేందుకు ఈ రూల్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. 

Also Read: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు బిగ్ షాక్

ఎన్నో ఏళ్ల నుంచి ఈ రూల్స్‌ను బ్యాంకు వారసత్వంగా కొనసాగిస్తోందని.. ఇకపైనా కూడా ఈ రూల్స్‌ అమల్లో ఉంటాయని బ్యాంకు వెబ్‌సైట్‌లో తెలిపారు. అయితే ఓ వ్యక్తి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. ఇలాంటి వింత రూల్‌పై నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రూల్‌ ఎక్కడా చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read :  ఇదేం వింత రూల్‌ రా అయ్యా.. ఆ జాబ్‌లో చేరాలంటే రక్తంతో సంతకం చేయాల్సిందే

Advertisment
Advertisment
తాజా కథనాలు