Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు బిగ్ షాక్

మెక్సికో, కెనడా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ పోస్ట్ చేశారు. చైనా వస్తువులపై కూడా 10 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు. 

New Update
DJ Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ట్రంప్‌ వివిధ దేశాల నుంచి దిగుపతి అయ్యే వస్తుల సుంకాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మెక్సికో, కెనడా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ పోస్ట్ చేశారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల సరఫరా, వలసలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.   

Also Read: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ?

'' జనవరి 20న నా మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఒకటిగా మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు వచ్చేటటువంటి అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించేందుకు అవసరమైన డాక్యుమెంట్స్‌పై సంతకం చేస్తానని'' చెప్పారు. దీంతోపాటు చైనా వస్తువులపై కూడా 10 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు. 

Also Read :  Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు!

Donald Trump Threatens Big Tariff Hikes

ట్రంప్ ఆర్థిక అజెండాలో సుంకాలు కీలకంగా ఉన్నాయి. తాను అధ్యక్షుడిగా అయ్యాక వివిధ దేశాల నుంచి వచ్చే వస్తువులపై దిగుమతి సుంకాలు విధిస్తానని చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆయన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు ఈ సుంకాలు దేశ వృద్ధిని దెబ్బతీస్తాయని, అలాగే ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచుతాయని పలువురు ఆర్థకవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు.  

Also Read: పాన్ కార్డ్ 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం..

అయితే కెనడా నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై 25 శాతం సుంకాలు విధించడాన్ని కెనడా నేత జిగ్మిత్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. సుంకాలు పెంచినట్లు ఉన్న వార్తను ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం దేశం కోసం నిలబడాలని, సుంకాల పెంపునకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 

Also Read :  మధుమేహం ఉన్నవారికి ఈ అల్సర్లు తప్పవు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు