Jammu-Kashmir Encounter: జమ్మూలో భారీ ఎన్కౌంటర్..ఇద్దరు జవాన్లకు గాయాలు..!!
అనంతనాగ్‌లోని గాడోల్ అడవుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారన్న పక్కా సమాచారంతో భద్రతబలగాలు చుట్టుముట్టాయి. వీరిని అంతమొందించేందుకు సైన్యం, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదులను ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని వారిని అంతమొందిస్తామని డీజీపీ తెలిపారు.