Trump-Israel: ట్రంప్‌ నకు గోల్డెన్‌ పేజర్‌ బహుమతి

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నకు ఒక బంగారు పేజర్‌ ను బహుమతిగా ఇచ్చారు.గతేడాది లెబనాన్‌,సిరియాల పై జరిగిన ఘోరమైన పేజర్‌ దాడులకు ఇది సూచన అని జెరూసలేం పేర్కొంది.

New Update
nethanyahu

nethanyahu

Trump: ఇజ్రాయెల్‌, గాజా యుద్ధం తాజా పరిస్థితుల గురించి చర్చించడానికి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్‌ నకు నెతన్యాహు ఒక బంగారు పేజర్‌ ను బహుమతిగా ఇచ్చారు.

Also Read: Horoscope Today:ఈ రాశుల వారికి ఈరోజు అన్నీ వృథా ఖర్చులే..తగ్గించుకుంటే బెటర్‌!

గతేడాది లెబనాన్‌,సిరియాల పై జరిగిన ఘోరమైన పేజర్‌ దాడులకు ఇది సూచన అని జెరూసలేం పేర్కొంది.ఇక గోల్డెన్‌ పేజర్‌ తో పాటు సాధారణ పేజర్‌ సైతం కానుకగా ఇచ్చారు.దీన్ని స్వీకరించిన ట్రంప్‌ కృతఙత తెలపడంతో పాటు నాటి ఆపరేషన్‌ గొప్పదిగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ 17న లెబనాన్‌, సిరియాల్లో వందల సంఖ్యలో పేజర్లు పేలిపోయాయి.

Also Read:Jeeth adani:పెళ్లి వేళ దివ్యాంగులకు జీత్ అదానీ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ ఎన్నిలక్షలసాయం అందించారంటే!

 పేజర్‌ దాడుల ఆపరేషన్‌..

ఆ ఘటనలో 40 మంది చనిపోగా...దాదాపు 3 వేల మంది గాయాలపాలయ్యారు. ఈ అనూహ్య దాడి వెనక ఇజ్రాయెల్‌ హస్తమున్నట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటనకు సంబంధించి లెబనాన్‌ ఐరాసకు ఫిర్యాదు చేసింది.దాదాపు రెండు నెలల తరువాతహెజ్‌బొల్లా లక్ష్యంగా పేజర్‌ దాడుల ఆపరేషన్‌ ను తామే చేసినట్లు అంగీకరించారు.

సెప్టెంబర్ 17 మరియు 18 తేదీల్లో జరిగిన పేలుళ్లకు నెలల ముందు హిజ్బుల్లా ఆదేశించిన పేజర్లలో ఇజ్రాయెల్‌కు చెందిన మొసాద్ నిఘా సంస్థ పేలుడు పదార్థాలను అమర్చినట్లు వెల్లడైంది. కనీసం 39 మంది ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా సభ్యులు మరణించారు దాదాపు 3,000 మంది గాయపడ్డారు.

అక్టోబర్‌లో హమాస్ ఇజ్రాయెల్ పట్టణాలపై దాడి చేసిన తర్వాత గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్, హిజ్బుల్లా లెబనీస్ సరిహద్దు ల వెంట పోరాడుతున్నాయి. అప్పటి నుండి, ఇరాన్ మద్దతుగల గ్రూప్ మాజీ చీఫ్ హసన్ నస్రల్లాతో సహా అనేక మంది హిజ్బుల్లా నేతలను హతమార్చడం జరిగింది.

సమావేశం తరువాత, ట్రంప్ అమెరికా గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటుందని , అవసరమైతే ఈ ప్రాంతంలో అమెరికా తన దళాలను మోహరిస్తుందని చెప్పారు. పేలని బాంబులను అమెరికా తొలగిస్తుందని,  ధ్వంసమైన భవనాలను పూర్తిగా నేలమట్టం చేసి తిరిగి ఆర్థిక అభివృద్ధిని సృష్టిస్తుందని" ఆయన అన్నారు.

ఈ క్రమంలోనే  నెతన్యాహు ట్రంప్‌ను "ఇజ్రాయెల్‌కు ఇప్పటివరకు ఉన్న గొప్ప స్నేహితుడు" అని పేర్కొన్నారు. "ఇజ్రాయెల్ ప్రజలు అగ్రరాజ్య నాయకుడి పట్ల అపారమైన గౌరవాన్ని కలిగి ఉన్నారు" అని అన్నారు. అమెరికా అధ్యక్షుడి గాజా ప్రణాళిక "చరిత్రను మార్చగలదు"  అని ఆయన అన్నారు.

Also Read:ఆమే నా సీరియస్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates

Also Read:Illegal Indian Immigrants: అమెరికా 5 రెట్లు ఖర్చు చేసి.. ఆర్మీ విమానాల్లో సంకెళ్లతో మనోళ్లు

Advertisment
తాజా కథనాలు