Israel: ఇరాక్ నుంచి ఇజ్రాయెల్‌ పైకి డ్రోన్లు...

ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకం చేసింది. ఇది జరిగి మూడు రోజులు అయింది. హమ్మయ్య యుద్ధం ఆగినట్టే అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు కొత్తగా ఇరాక్ ఇజ్రాయెల్ మీద దాడలు మొదలెట్టింది.

author-image
By Manogna alamuru
New Update
war

ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయినా అక్కడక్కడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు ఇంకా దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఈ పరిస్థితులు నెమ్మదిగా సద్దుమణుగుతాయని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఇరాక్‌ వైపు నుంచి ఇజ్రాయెల్‌లోకి  రెండు డ్రోన్లు దూసుకొచ్చినట్లు ఐడీఎఫ్ అధికారులు తెలిపారు. మధ్యధరా సముద్రంలోని నేవీ మిస్సైల్ బోటు సాయంతో వాటిని తమ ఆర్మీ నేలకూల్చాయని చెప్పారు. అవి ‘తూర్పు’ నుంచే వచ్చాయని, ఇరాక్‌ వాటిని ప్రయోగించింది అని చెప్పడానికి అదొక కోడ్‌  అని ఐడీఎఫ్ అధికారులు వివరించారు.

ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..

అప్పుడే తిరిగి రావొద్దు..

మరోవైపు ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణతో లెబనాన్, గాజాలో పరిస్థితులు నెమ్మదిగా సద్దుమణుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు తమ ప్రాంతాలకు వెళుతున్నారు. అయితే ఐడీఎఫ్ మాత్రం అప్పుడే తిరిగి రావద్దని హెచ్చరిస్తోంది. కాల్పులు విరమణ మీద ఇంకో ప్రకటన వచ్చే వరకు సురక్షిత ప్రాంతాలను వదిలి రావద్దని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఐడీఎఫ్ యుద్ధరంగాలను, సరిహద్దు గ్రామాలను వదిలి వెళ్ళడానికి 60 రోజుల సమయం ఉంది. ఈలోపు ఏమైనా జరొగొచ్చు అని అధికారులు చెబుతున్నారు. 

Also Read: Ukraine: ఇంక చేయలేము..చేతులెత్తేస్తున్న ఉక్రెయిన్ సైనికులు

ఇది కూడా చూడండి: Adani: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ

Advertisment
Advertisment
తాజా కథనాలు