/rtv/media/media_files/2024/11/21/gjGg8SfemLAKsKhXv04h.jpg)
ప్రతీ దాడి మమ్మల్ని మరింత బలపరుస్తుంది. ప్రతీ అవరోధం అదానీ గ్రూప్‌ను మరింత ధృఢంగా ఎదుర్కొని...ఎక్కువగా ఎదిగేందుకు తోడ్పడుతుందని అదానీ చెప్పారు.
నిబద్ధతతో ఉన్నాం..
రాజస్థాన్లో జరిగిన 51వ జెమ్ అండ్ జ్యూయలరీ అవార్డు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము నిజాయితీగానే ఉన్నామని..నిబద్ధతతోనే వ్యాపారం చేస్తున్నామని గౌతమ్ అదానీ చెప్పారు. తమ ముందున్న సవాళ్ళేమీ తమని విచ్ఛిన్నం చేయలేవని...పతనం తర్వాత మరింత పైకి లేస్తామని చెప్పారు. ముందు ముందు మరిన్ని సవాళ్ళు కూడా వస్తాయని..వాటిని ఎదుర్కొనేందుకు మరింత సన్నద్‌ధం అవుతున్నామని అదానీ తెలిపారు.
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై మరోసారి అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు భారీగా లంచం ఇచ్చారని అభియోగాలు మోపింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్‌తో కలిసి అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎస్ఈసీఐతో 12 జీడబ్ల్యూ సౌర విద్యుత్ ఒప్పందాన్ని పొందిందని ఆరోపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కేసులు పెట్టారు అదానీ గ్రూప్ మీద. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఖరీదైన విద్యుత్ ఒప్పందాలు అంగీకరించేలా చేయడానికి, ఈ కంపెనీలు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలకు 256 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చారని ఆరోపించింది.
అదానీతో పాటు తన మేనల్లుడు సాగర్, మరో ఏడుగురిపై కూడా అమెరికాలో కేసు నమోదైంది. సాగర్‌కి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని అహ్మదాబాద్‌లో ఉన్న సాగర్ బోదక్ దేవ్ ఇంటికి ఈ నోటీసులు పంపింది. అయితే వీటిపై 21 రోజుల్లోగా కోర్టుకు వివరణ ఇవ్వాలని తెలిపింది. నోటీసులకు వివరణ ఇవ్వకపోతే.. తీర్పు వ్యతిరేకంగా ఉంటుందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ హెచ్చరించింది.