Israel-Hezbollah : హెజ్బుల్లా కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా ఆమోదించినట్లు సమాచారం. దీనిపై ఇరు దేశాల మధ్య సానుకూల చర్చలు నడుస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
Also Read : 🔴IPL Auction Day -2: ఐపీఎల్ మెగా వేలం.. లైవ్ అప్డేట్స్!
మరోవైపు బీకర దాడులు..
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తమ అధికారులతో దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. భద్రతా సంప్రదింపుల సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా ఆమోదించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, అన్ని సమస్యలు పరిష్కరించబడే వరకు ఒప్పందం అంతిమంగా ఉండదని మరికొన్ని కథనాలు వెలువడ్డాయి. 'కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. ఇది ఇంకా జరగలేదు. చర్చలు ఒక ఒప్పందం వైపు సానుకూలంగా కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ -హెజ్బుల్లా కాల్పులను కొనసాగిస్తున్నాయి. ఇందులో ఒక పొరపాటు జరిగిన పరిస్థితులు మారొచ్చు'అని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ల్యాండ్‌మైన్స్ ఉత్పత్తిపై నిషేధం.. ఐరాస చీఫ్ కీలక ప్రకటన!
ఇక ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు క్షిపణుల వర్షం కురుస్తోంది. సెంట్రల్ బీరుట్‌పైకి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగా దాదాపు వంద మంది చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్‌పై హెజ్బుల్లా క్షిపణుల వర్షం కురిపించింది. 250 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం కోసం జరుగుతున్న చర్చల్లోకి అమెరికా దిగింది. ఇక కాల్పుల విరమణ ఒప్పందానికి సై అంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. కొన్ని సమస్యలు పరిష్కరించాలని కండిషన్ పెట్టారు.
ఇది కూడా చదవండి: KTR: తప్పు జరిగింది.. పొరపాటైంది: లగచర్ల మహాధర్నాలో కేటీఆర్
Also Read : మొత్తానికి అసలు బాయ్ ఫ్రెండ్ ఎవరో బయటపెట్టిన రష్మిక..!