/rtv/media/media_files/2025/10/03/zubeen-garg-2025-10-03-08-33-54.jpg)
Zubeen Garg
అస్సామీ ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ ఓ బోట్ ట్రిప్ లో ప్రమాదవశాత్తు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సెప్టెంబర్ 19న సింగపూర్ లో జరిగిన 20వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన గార్గ్ అక్కడ సముద్రంలో మునిగి చనిపోయారు. మొదట ఆయన స్కూబా డైవింగ్ చేస్తుండగా మరణించారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే తరువాత జుబీన్ స్కూబా డైవింగ్ టైమ్ అప్పుడు కాదని...తరువాత స్విమ్ గేర్ వేసుకోకుండా సముద్రంలోకి వెళ్లారని..అప్పుడు చనిపోయారని చెబుతున్నారు.
మరో ఇద్దరి అరెస్ట్..
జుబీన్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ కేసు విచారణ కోసం అస్సామీ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన SIT జుబీన్ మరణించిన సమయంలో ఆయనతో ఉన్నవారందరినీ విచారిస్తోంది. ఇందులో ఇప్పటికే జుబీన్ మేనేజర్ తో మరొకరి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరిని అదుపులోఇ తీసుకున్నారు. గార్గ్ సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి, సహ గాయకురాలు అమృతప్రభ మహంతలను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. జబీన్ సముద్రంలో ఈతకు వెళ్ళినప్పుడు గోస్వామి, మహంత ఇద్దరూ ఆయనతో కలిసే ఉన్నారు. గోస్వామి గార్గ్‌కు చాలా దగ్గరగా ఈత కొడుతున్నట్లు వీడియోలలో కనిపించింది, అయితే మహంత తన సెల్‌ఫోన్‌లో మొత్తం సంఘటన రికార్డ్ చేశారు. అందుకే వారిద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
భార్య గరిమ సంచలన ఆరోపణలు..
మరోవైపు జుబీన్ గార్గ్ భార్య గరిమ గార్గ్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త ఆరోగ్యం బాలేకపోయినా బలవంతంగా సింగపూర్ తీసుకెళ్ళారని గరిమ ఆరోపించారు. అక్కడకు వెళ్ళాక తన భర్త పట్ల చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని చెప్పారు. తన భర్తకు గుండెజబ్బు లేదని..ప్రయాణంలో అలిసిపోయారని చెప్పుకొచ్చారు. జుబీన్ గార్గ్ చనిపోక ముందు తనతో ఫోన్‌లో మాట్లాడానని.. ఒక్కసారి కూడా పిక్నిక్ అంశాన్ని ప్రస్తావించలేదని గరిమా గార్గ్ గుర్తుచేశారు. అంటే పిక్నిక్ అంశం జుబీన్ గార్గ్ కూడా తెలియకపోవచ్చని అన్నారు. జుబీన్ గార్గ్ ఎప్పుడూ పగటి పూటే నిద్రపోతారని.. అలాంటిది బలవంతంగా తీసుకెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. జుబీన్ గార్గ్ ఎప్పుడూ మందులు వాడుతుంటారు. అలాంటిది మందులు ఇచ్చారో లేదో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇవ్వాలని నిర్వాహకులను అడిగానని.. కానీ ఇప్పటి వరకు మాత్రం అందించలేదని గరిమా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా స్కూబా డైవింగ్ వల్ల జరిగిన మృతి కాదని ఆమె అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని..తనకు త్వరలోనే న్యాంగ జరుగుతుందని ఆశిస్తున్నానని గరిమా గార్గ్ అన్నారు.
Also Read: Delhi Baba: అమ్మాయి నచ్చితే ప్రత్యేక గది, సెల్ ఫోన్..ఢిల్లీ బాబా మహిళా సహాయకులు అరెస్ట్