/rtv/media/media_files/2025/05/03/0JYQGKN7vglvXuxIheTL.jpg)
khawaja asif
భారత్ తో యుదధం గురించి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో భారత్ మళ్ళీ తమతో యుద్ధానికి దిగొచ్చని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈసారి పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు. మేము భారత్ ను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించడం లేదు. అలాగే తాము ఆ దేశాన్ని నమ్మడం కూడా లేదని ఆయన అన్నారు. నా విశ్లేషణ ఆధారంగా సరిహద్దు చొరబాట్లు, దాడులు లేదా పూర్తి స్థాయి యుద్ధానికి దిగొచ్చని...ఖవాజా అన్నారు. శత్రు వ్యూహాన్ని తాను పసిగట్టగలనని నమ్మకంగా చెప్పారు. అందుకే తాము పూర్తి అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను "88 గంటల ట్రైలర్" అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అభివర్ణించిన కొన్ని రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే పొరుగు దేశానికి బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో నేర్పించడానికి తమ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఖవాజా నోరు పారేసుకున్నారు.
Pakistani Def Min Khawaja Asif
— War & Gore (@Goreunit) November 19, 2025
"I cannot rule out an ALL-OUT WAR or any hostile strategy from India, including border incursions or attacks. We must stay fully alert". pic.twitter.com/IqYBMZoUVq
భారత్, ఆఫ్ఘాన్ రెండిటితోనూ చిచ్చు..
ఖవాజా ఆసిఫ్ భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండు దేశాలకు ఒకేసారి హెచ్చరికలు జారీ చేశారు. ముము సిద్ధంగా ఉన్నాము. తూర్పు(భారత్), పశ్చిమ(ఆఫ్ఘాన్) సరిహద్దులను ఎదుర్కోవడానికి అని చెప్పారు. మొదటి రౌండ్ లో అల్లా తమకు సాయం చేశాడని..రెండో రౌండ్ లో కూడా ఆయన తమ తోడు ఉంటారని చెప్పారు. పొరుగు దేశాలు కోరుకుంటే తమకు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని ఖవాజా అన్నారు. పాకిస్తాన్ కు భారత్ తో పాటూ ఆఫ్ఘాన్ తో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్యనా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కానీ ఎప్పుడైనా దాడులు చేసుకోవచ్చనే పరిస్థితి ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఆఫ్ఘనిస్తాన్ నుండి జరిగే దాడులలో భారతదేశం పాత్ర పోషిస్తోందని ఆసిఫ్ ఇంతకు ముందు ఆరోపించారు.
Also Read: India-China-US: భారత్-చైనా సంబంధాలు, ఆపరేషన్ సింధూర్ పై అమెరికా సంచలన రిపోర్ట్..
Follow Us