Israel:ఊచకోతకు ఏడాది.. 365 రోజుల వినాశనం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మొదలైన ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలిగొంది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 41 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ సైనికులు కర్కశత్వానికి ప్రాణాలు కోల్పోయారు.పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి

year
New Update

Israel-Iran : అక్టోబర్ 7, 2023.. అంటే సరిగ్గా ఏడాది క్రితం.. పాలస్తీనా మద్దతు సంస్థ హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడికి దిగిన రోజు.. గతంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న సెటిల్‌మెంట్‌ ప్రాంతాలపై హమాస్‌ రాకెట్లతో విరుచుకుపడింది. 1200 మంది ఇజ్రాయెలీలు ఈ దాడుల్లో చనిపోయారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో ఇజ్రాయెల్‌ ప్రతీకార చర్యకు దిగింది. నాటి నుంచి నేటి వరకు పాలస్తీనా గడ్డపై నెత్తుటి వర్షాన్ని కురిపిస్తోంది. ఈ ఏడాది కాలంలో 41వేల మంది పాలస్తీనీయన్లు చనిపోయారు. అందులో దాదాపు సగం మంది అన్నెంపున్నెం తెలియని అమాయక పిల్లలే ఉండడం అత్యంత బాధాకరం.

Also Read: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్‌!

అక్టోబర్ 7 హమాస్‌ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా హమాస్‌ను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అక్టోబర్ 13, 2023న ఇజ్రాయెల్ గాజాపై ముందుగా వైమానిక దాడులు చేసింది. గాజా భూభాగాన్ని ముట్టడి చేసింది. నవంబర్ 15, 2023న ఇజ్రాయెల్ దళాలు గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫాపై దాడి చేశాయి. ఫిబ్రవరి 29, 2024న, ఇజ్రాయెల్ బలగాలు ఘోరానికి తెగబడ్డారు. ఆహారం అందించేందుకు వస్తున్న కాన్వాయ్ వైపు నడుస్తున్న 120 మంది పాలస్తీనియన్లను కాల్చి చంపారు. ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది.

birot

మే 7, 2024న రఫాపై ఇజ్రాయెల్ భూదాడిని ప్రారంభించింది. జూలై 2024 నాటికి, ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌పై పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించింది. హమాస్ సాయుధ విభాగం చీఫ్ మహమ్మద్ దీఫ్, హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్‌లను చంపేసింది. ఇక సెప్టెంబరు 2024లో, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా పాలస్తీనాకు సపోర్ట్‌గా ఉంటుంది. సెప్టెంబరు 17, 18న లెబనాన్ అంతటా వేలాది హిజ్బుల్లా సభ్యుల పేజర్లు, వాకీ-టాకీలు పేలడం సంచలనం రేపింది. ఈ దాడుల్లో  39 మంది మరణించారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు.

Also Read: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..!

ఇక సెప్టెంబర్‌ చివరి వారంలో హిజ్బుల్లాలోని పెద్ద తలకాయలే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ రెచ్చిపోయింది. సెప్టెంబరు 27న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బుల్లా లీడర్‌ హసన్ నస్రల్లా హతమయ్యారు. దీంతో ఇరాన్‌ నేరుగా రంగంలోకి దిగింది. నస్రల్లా మరణం వ్యర్థం కాదంటూ ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. నేరుగా ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. అక్టోబర్ 1 ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఇలా అక్టోబర్‌ 7, 2023 తర్వాత ఈ ఏడాది కాలంలో పశ్చిమాసియాను నిప్పుల కొలిమిగా మారింది.

lebanan

అయితే ఈ సమస్యకు కారణం అక్టోబర్ 7 అని భావిస్తే మాత్రం అది ముమ్మాటికి తప్పే అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్‌-పాలస్తీనా సమస్య దాదాపు 8 దశాబ్దాల నాటి నుంచి ఉంది. పాలస్తీనాలోని గాజా ప్రాంతాన్ని మాత్రమే తీసుకున్నా.. దాన్ని ఇజ్రాయెల్ చుట్టుముట్టి ఇప్పటికీ 18ఏళ్లు అవుతోంది. 1948లో ఇజ్రాయెల్‌ తనకు తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న నాటి నుంచి ఈ సమస్య మొదలైంది. పాలస్తీనా భూభాగాలు కూడా తమవేనని అమెరికా అండతో బరితెగించిన ఇజ్రాయెల్‌ 1948లోనే దాదాపు 15 వేల మంది పాలస్తీనీయన్లను ఊచకోత కోసింది.

Also Raed: ‘బతుకమ్మ’కు అరుదైన గౌరవం.. అధికారికంగా గుర్తించిన అమెరికా!

పాలస్తీనాలో జరిగే హింసకు జాతి వివక్ష భావజాలమే కారణమాంటారు చరిత్రకారులు. నిరంతర నిర్బంధం, అవమానాలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం పాలస్తీనా యువతను ప్రతిఘటనకు పురికొల్పుతోంది. వారంతా హమాస్‌ లాంటి సంస్థల్లో చేరుతున్నారు. ఇజ్రాయెల్‌పై తిరుగబడుతున్నారు. ఇదంతా సమస్య మూలాలకు సంబంధించిన విషయం. మొత్తానికి ఇజ్రాయెల్‌-పాలస్తీనా సమస్య ఇప్పటితో పోయేది కాదని అర్థమవుతోంది. ఇరువైపులు తాత్కాలికంగా ఈ యుద్ధాన్ని ఆపేసినా మళ్లీ ఏదో ఒక రోజు హింస చెలరేగక తప్పదు.. యుద్ధం రాకా మానదు..! ఎందుకంటే ఇది ఎడతెగని యుద్ధం.. మతం రంగు మారణహోమాన్ని ఎలా సృష్టిస్తుందో చెప్పేందుకు సజీవ సాక్ష్యం!

Also Read: ఇజ్రాయెల్‌ లో ఉద్రిక్త పరిస్థితులు..విమానాలు రద్దు చేసిన ఇరాన్‌!

#israel #iran #hamas #gaza
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe