HYD: హరీశ్‌రావు గృహ నిర్భంధం..భారీగా పోలీసులు

బీఆర్ఎస్ నేత హరీశ్​ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారు. కోకాపేటలో ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.  

author-image
By Manogna alamuru
New Update
harish raooo

BRS Leader Harish Rao

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పెద్ద దుమారమే రేపింది. బీఆర్ఎస్ నేతలు ఈ అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిన్ననే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లాంటి వారు స్పందించారు. అతని అరెస్ట్ అక్రమం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హరీశ్ రావు గృహనిర్భంధం..

ఈక్రమంలో ఈరోజు హరీశ్ రావును గృహనిర్భంధంలో ఉంచారు పోలీసులు. కోకాపేటలో ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా పోలీసులు ఈమేరకు చర్యలు చేపట్టారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో డీజీపీ జితేందర్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు నిన్న రాత్రి ఫోన్ చేశారు. అరెస్ట్ చేయదగిన కేసు కాదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. పండుగ వేళ ప్రజా ప్రతినిధిని అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి అక్రమ కేసు బనాయించడం తగదని.. కక్షసాధింపు చర్యలకు పోలీసులు సహకరించవద్దని సూచనలు చేశారు. తక్షణమే స్టేషన్ బెయిల్‌పై కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని కోరారు.

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి జరిగిన కార్యక్రమలో కౌశిక్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో సంజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం జూబ్లిహీల్స్‌లో కౌశిక్‌ రెడ్డిని అరెస్టు చేశారు.హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు తరలించారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు.  రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. రోజుకో బీఆర్ఎస్‌ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్‌ సర్కార్‌కు అలవాటైందని విమర్శించారు.

Also Read: Cricket: కెప్టెన్సీ రేసులో జైశ్వాల్...కోచ్ గంభీర్ మద్దతు

Advertisment
తాజా కథనాలు