Iraq: ఇరాక్ ప్రభుత్వం వివాహానికి సంబంధించి దుర్మార్గపు చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. తొమ్మిదేళ్ల బాలికలను పెళ్లి ఈడు పురుషులకు ఇచ్చి పెళ్లి చేసే వీలు కల్పించే విధంగా వివాహ చట్టాన్ని సవరణ చేసి, అమోదించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చట్టం అమల్లోకి వస్తే.. మహిళలు విడాకులు, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులను కూడా కోల్పోయే అవకాశం ఉండగా.. ఆ దేశ స్త్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
Also Read: ఫామ్ హౌజ్ లో బెంజ్ కారు నడిపిన కేసీఆర్.. వీడియో వైరల్!
పర్సనల్ స్టేటస్ యాక్ట్..
ఈ మేరకు సంప్రదాయవాద షియా ముస్లిం పార్టీల సంకీర్ణం ఆధిపత్యంలో ఉన్న ఇరాక్ పార్లమెంట్ 'పర్సనల్ స్టేటస్ యాక్ట్'ను మర్చేందుకు రంగం సిద్దం చేసినట్లు వార్తలొస్తున్నాయి. 188 చట్టం అని పిలిచే దీనిని 1959లో ప్రవేశపెట్టగా.. ఈ చట్టాన్ని ఇరాక్‌లోని షియా పార్టీలు 2014, 2017లోనూ సవరించేందుకు ప్రయత్నించాయి. ఇక ఇరాక్ పార్లమెంట్ ఈ చట్టాన్ని సవరిస్తే దేశంలోని మహిళలకు ఉన్న ముఖ్యమైన హక్కులు అన్ని తొలగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. పార్లమెంట్ తాజా సవరణలపై ఓటింగ్‌కు ముందు అధికారికంగా చర్చించనుంది ఇరాక్.
ఇది కూడా చదవండి: కేటీఆర్ ఢిల్లీకి అందుకే వెళ్తున్నారు.. బాంబ్ పేల్చిన మంత్రి పొన్నం
అయితే పిల్లల అత్యాచారాలను చట్టబద్ధం చేయడానికే ఇరాక్ ప్రయత్నిస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. UNICEF ప్రకారం బాల్య వివాహాలు ఇరాక్‌లో ఎక్కువగా ఉండగా.. దాదాపు 28% ఇరాక్ అమ్మాయిలకు 18 సంవత్సరాల వయస్సులోపే పెళ్లిల్లు జరుగుతున్నాయి. ఈ చట్టం సవరణలపై ఇప్పటికే ఇరాక్ లో నిరసనలు చెలరేగగా.. ఇరాక్ మహిళాలు పెద్దెత్తున్న నిరసనలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Kodangal: కలెక్టర్ పై దాడి చేసిన వారికి బిగ్ షాక్.. రంగంలోకి డీజీపీ!
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు!