Iraq: 9ఏళ్ల బాలికలకు పెళ్లి.. అక్కడి దుర్మార్గపు చట్టంపై మహిళల ఆందోళన!

తొమ్మిదేళ్ల బాలికలకు పెళ్లి చేసే చట్టాన్ని ఇరాక్ అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయవాద షియా ముస్లిం ప్రభుత్వం'పర్సనల్ స్టేటస్ యాక్ట్'ను మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

author-image
By srinivas
New Update
trer

Iraq: ఇరాక్ ప్రభుత్వం వివాహానికి సంబంధించి దుర్మార్గపు చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. తొమ్మిదేళ్ల బాలికలను పెళ్లి ఈడు పురుషులకు ఇచ్చి పెళ్లి చేసే వీలు కల్పించే విధంగా వివాహ చట్టాన్ని సవరణ చేసి, అమోదించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చట్టం అమల్లోకి వస్తే.. మహిళలు విడాకులు, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులను కూడా కోల్పోయే అవకాశం ఉండగా.. ఆ దేశ స్త్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. 

Also Read: ఫామ్ హౌజ్ లో బెంజ్ కారు నడిపిన కేసీఆర్.. వీడియో వైరల్!

పర్సనల్ స్టేటస్ యాక్ట్..

ఈ మేరకు సంప్రదాయవాద షియా ముస్లిం పార్టీల సంకీర్ణం ఆధిపత్యంలో ఉన్న ఇరాక్ పార్లమెంట్ 'పర్సనల్ స్టేటస్ యాక్ట్'ను మర్చేందుకు రంగం సిద్దం చేసినట్లు వార్తలొస్తున్నాయి. 188 చట్టం అని పిలిచే దీనిని 1959లో ప్రవేశపెట్టగా.. ఈ చట్టాన్ని ఇరాక్‌లోని షియా పార్టీలు  2014, 2017లోనూ సవరించేందుకు ప్రయత్నించాయి. ఇక ఇరాక్ పార్లమెంట్ ఈ చట్టాన్ని సవరిస్తే దేశంలోని మహిళలకు ఉన్న ముఖ్యమైన హక్కులు అన్ని తొలగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. పార్లమెంట్ తాజా సవరణలపై ఓటింగ్‌కు ముందు అధికారికంగా చర్చించనుంది ఇరాక్.

ఇది కూడా చదవండి: కేటీఆర్‌ ఢిల్లీకి అందుకే వెళ్తున్నారు.. బాంబ్ పేల్చిన మంత్రి పొన్నం

అయితే పిల్లల అత్యాచారాలను చట్టబద్ధం చేయడానికే ఇరాక్ ప్రయత్నిస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. UNICEF ప్రకారం బాల్య వివాహాలు ఇరాక్‌లో ఎక్కువగా ఉండగా.. దాదాపు 28% ఇరాక్ అమ్మాయిలకు 18 సంవత్సరాల వయస్సులోపే పెళ్లిల్లు జరుగుతున్నాయి. ఈ చట్టం సవరణలపై ఇప్పటికే ఇరాక్ లో నిరసనలు చెలరేగగా.. ఇరాక్ మహిళాలు పెద్దెత్తున్న నిరసనలు చేపట్టారు. 

ఇది కూడా చదవండి: Kodangal: కలెక్టర్ పై దాడి చేసిన వారికి బిగ్ షాక్.. రంగంలోకి డీజీపీ!

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు