Supreme Leader Khamenei : ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా..మళ్లీ ఎప్పుడంటే?

ఇజ్రాయెల్‌, అమెరికా సైన్యాల దాడిలో మరణించిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ వాయిదా వేసుకుంది. భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్లామిక్‌ డెవలప్‌మెంట్‌ కోఆర్డినేషన్‌ కౌన్సిల్‌ అధిపతి మోహసిన్‌ మహ్మదీ తెలిపారు.

New Update
Iran Raises Red Flag Over Mosque After Khamenei Killing

Khamenei

Supreme Leader Khamenei : ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త సైన్యాల దాడిలో మరణించిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ వాయిదా వేసుకుంది. భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్లామిక్‌ డెవలప్‌మెంట్‌ కోఆర్డినేషన్‌ కౌన్సిల్‌ అధిపతి మోహసిన్‌ మహ్మదీ  ఇరాన్‌ ప్రభుత్వ మీడియాకు వెల్లడించారు. త్వరలో అంత్యక్రియల తేదీలను ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపారు. నిజానికి ఆయనను ఆయన జన్మించిన మషాద్‌ పట్టణంలో పూడ్చాలని నిర్ణయించి భౌతికకాయాన్ని అక్కడికి తరలించారు.

బుధవారం అంత్యక్రియలు జరుగుతాయని మొదట ప్రకటించినప్పటికీ  చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇజ్రాయేల్‌, అమెరికా(america) సైన్యాలతో ఇరాన్‌ ల మశధ్య పరస్పర దాడులు కొనసాగుతుండటమే  అంత్యక్రియల వాయిదాకు కారణమని తెలుస్తోంది. అంతిమ నివాళులర్పించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముందని ఇరాన్‌ భావిస్తోంది. అంత్యక్రియల ఏర్పాట్లను సమన్వయ మండలి అధ్యక్షుడు మెహసిన్‌ మహ్మదీ పర్యవేక్షిస్తున్న  విషయం తెలిసిందే.

Also Read :  ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి పాకిస్తాన్.. రంగంలోకి దిగేందుకు 5 కారణాలు!

అణు ప్లాంట్‌ను టార్గెట్‌ చేస్తాం... ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ హెచ్చరిక

కాగా, ఇరాన్ ఈ రోజు మరోసారి ఇజ్రాయెల్‌(isreal airport attack) కు  మరోసారి వార్నింగ్‌ ఇచ్చింది. ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు ప్లాంట్‌ను టార్గెట్‌ చేస్తా మంటూ ఇరాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇరాన్‌లో పాలకులను మార్చేందుకు అమెరికా యత్నిస్తోందని ఇరాన్‌(iran-isreal-war) ఆరోపించింది. ఈ మేరకు ఇరాన్‌ మీడియా సంస్థ ఐఎస్‌ఎన్‌ఏ ఓ కథనాన్ని వెల్లడించింది. ఇరాన్‌లో పాలకులు మారేవరకు అమెరికా యుద్ధం కొనసాగిస్తుందని జెరూసలెం పోస్టుకు అధికారులు వెల్లడించారు. కాగా చర్చల కోసం  అమెరికాకు ఎలాంటి సందేశాలు పంపలేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. తమ సైన్యం సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు టాస్నిమ్‌ న్యూస్‌కు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు.

Also Read :  ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి.. మిగతా కుటుంబం ఎక్కడ?

Advertisment
తాజా కథనాలు