Iran: ఇజ్రాయెల్ క్యాన్సర్ లాంటిది..విరుచుకుపడ్డ ఇరాన్ సుప్రీం లీడర్

దాడులు, కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ మీద విరుచుకుపడ్డారు. టెల్ అవీవ్ ఒక క్యాన్సర్ కణితి లాంటిదని అన్నారు. ఇజ్రాయెల్ నేరాల్లో అమెరికా పాలుపంచుకుంటోందని ఖమేనీ మండిపడ్డారు. 

New Update
Ali Khamenie

Ali Khamenie

అమెరికా, ఇజ్రాయెల్ తో తాము గొప్ప పోరాటం చేశామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అన్నారు. మళ్ళీ దాడులు చేసినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పనిలో పనిగా మరోసారి ఇజ్రాయెల్, అమెరికాల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ను క్యాన్సర్ తో పోల్చారు. ఎంత తీసేసినా అది మళ్ళీ మళ్ళీ వచ్చినట్టే ఇజ్రాయెల్ కు ఎప్పటికీ బుద్ధి రాదని మండిపడ్డారు.  ఇజ్రాయెల్‌ నేరాల్లో అమెరికా భాగస్వామని..వాషింగ్టన్‌ చెప్పు చేతల్లో నడుచుకుంటోందని ధ్వజమెత్తారు. మరోవైపు అమెరికాతో మరోసారి అణు ఒప్పందంపై చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఖమేనీ తెలిపారు. 

చర్చలకు సిద్ధం..

తాజాగా ఇరాన్ కాస్త వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం తమపై మళ్ళీ దాడులు చేయమని హామీ ఇస్తే చర్చలకు వస్తామని చెప్పారు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ . టెహ్రాన్‌లోని విదేశీ దౌత్యవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఇరాన్ అణు కేంద్రాలపై చేసిన దాడులు పరిస్థితులను సంక్లిష్టం చేశాయని.. అందుకే హామీ కోరుతున్నామని చెప్పారు. అణు కేంద్రాల తనిఖీల విషయంలో ‘ఐఏఈఏ’ విజ్ఞప్తిపై దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమాధానం ఇస్తామని చెప్పారు. తమ ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ఏజెన్సీ తనిఖీలు ఉండాలన్నారు. అణు కేంద్రాలపై ఇటీవలి దాడులతో రేడియోధార్మిక పదార్థాల వ్యాప్తి ముప్పు అధికంగా ఉందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు