జర్మనీపై విరుచుకుపడ్డ ఇరాన్.. మానవ హక్కులపై మాట్లాడే హక్కు లేదంటూ వార్నింగ్

ఇరాన్ ప్రభుత్వం చివరి దశలో ఉందని జర్మన్ ఛాన్స్‌లర్‌ ఫ్రెడరిక్ మెర్జ్ చేసిన ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందించారు. జర్మనీకి మానవ హక్కుల సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు.

New Update
Iran slams Germany

Iran slams Germany

గత రెండు వారాలుగా ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుప్రీ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారం నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రభుత్వం చివరి దశలో ఉందని జర్మన్ ఛాన్స్‌లర్‌ ఫ్రెడరిక్ మెర్జ్ చేసిన ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఎక్స్‌ వేదికగా స్పందించారు. జర్మనీకి మానవ హక్కుల సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. గత కొన్నేళ్లుగా జర్మనీ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు ఆ దేశ విశ్వసనీయతను నాశనం చేశాయన్నారు. 

Also Read: సంక్రాంతి వేళ బిగ్ షాక్.. ప్రముఖ కంపెనీలో భారీగా లే‎ఆఫ్‎లు

గతేడాది ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేసినప్పుడు జర్మనీ ప్రశంసించిందంటూ విమర్శించారు. ఇటీవల అమెరికా ఓ దేశాధినేతను కిడ్నాప్ (మదురోను ఉద్దేశిస్తూ) చేస్తే జర్మనీ మౌనంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కులపై జర్మనీ స్పందన అశాస్త్రీయమైనదన్నారు. ఇదిలాఉండగా ఇరాన్‌లో జరిగిన ఘర్షణల్లో ఇప్పటిదాకా 12 వేల మంది చనిపోయినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 31 ప్రావిన్సుల్లో 600లకుపైగా ప్రాంతాల్లో ఈ నిరసనలు కొనసాగినట్లు అమెరికా కేంద్రంగా నడిచే మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ వెల్లడించింది. 

Also read: హిందువులకు ప్రత్యేక పోలింగ్ బూత్‌లు కావాలి.. హిందూ సంఘాల డిమాండ్

ఇరాన్‌లో ఇలా హింసాత్మక ఘటనలు కొనసాగితే చాలా కష్టమని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషన్ తెలిపింది. ఇరాన్ పౌరులు న్యాయమైన డిమాండ్లు వినాల్సిందేనని సూచించింది. మరోవైపు ఇరాన్‌పై 10 వేల మందికి పైగా నిరసనాకారులను అరెస్టు చేశారు. వీళ్లలో చాలామందికి మరణశిక్ష పడొచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. 

Advertisment
తాజా కథనాలు